పుష్ప డైలాగ్ నాదే.. అందుకే చాలా ఫీలయ్యా: మంచు లక్ష్మీ | Manchu Lakshmi about Pushpa Dialogue by Sukumar in his Film | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: సుకుమార్ నా డైలాగ్ వాడేశారు: మంచు లక్ష్మీ

Mar 10 2026 3:15 PM | Updated on Mar 10 2026 3:29 PM

Manchu Lakshmi about Pushpa Dialogue by Sukumar in his Film

టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష‍్మీ నటించిన తాజా చిత్రం లేచింది మహిళా లోకం. ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌ ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన మంచు లక్ష్మీ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఈ సినిమా పుష్ప-2 రిలీజ్‌కు కంటే పూర్తి చేశామని మంచు లక్ష్మీ తెలిపింది. పుష్ప చిత్రంలో వాడినా ఫ్లవర్‌ కాదు.. ఫైర్ అనే డైలాగ్ తాను ఈ చిత్రంలో వాడానని వెల్లడించింది. అయితే నా డైలాగ్ బయటికి రాలేదని పేర్కొంది. కానీ సుకుమార్‌ గారు ఈ డైలాగ్‌ను పుష్పలో వాడేశారని తెలిపింది. పుష్ప చూసినప్పుడు ఈ డైలాగ్‌ చూసి చాలా ఫీలయ్యానని మంచు లక్ష్మీ అన్నారు. ఆ డైలాగ్‌ ముందే వచ్చిందన్న విషయం అందరికీ తెలియజేస్తున్నానని మాట్లాడింది. కాగా.. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 26నే థియేటర్లలో సందడి చేయనుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement