Lechindi Mahila Lokam Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. 'గేదెల రాజు' అనే తెలుగు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది కానీ దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. మరోవైపు పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్', అలానే లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ 'వాలా 2' కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం దాదాపు 19కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతిఛాయ, బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం అనే తెలుగు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. హ్యాపీరాజ్ మూవీ కూడా ఇదే వీకెండ్ వచ్చే అవకాశముంది. ఇంతకీ ఏ సినిమా ఏ రోజు ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు)హాట్స్టార్బ్రూక్లిన్ నైన్ నైన్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) - ఏప్రిల్ 20ప్రతిఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 2424 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24 నెట్ఫ్లిక్స్రెజల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) - ఏప్రిల్ 19అన్ చూజన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 21హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 22స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 23అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్లేచింది మహిళా లోకం (తెలుగు సినిమా) - ఏప్రిల్ 22జీ5బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ఫ్రమ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కెవిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లేగ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
ఈ వారం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో సంభవం అధ్యాయం ఒన్ను, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, అస్సీ, సన్నాఫ్ చిత్రాలతో పాటు పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చేవారం కూడా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అలా ఓ తెలుగు కామెడీ చిత్రం ఓటీటీ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించిన తెలుగు సినిమా 'లేచింది మహిళా లోకం'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇదొకటి రిలీజైన సంగతి కూడా తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిదే వచ్చే బుధవారం(ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.భార్యభర్తల రిలేషన్, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, విడాకులు, కోర్టు కేసులు తదితర ట్రెండీ అంశాలతో ఈ సినిమాని తీశారు. అయితే ఈ సీరియస్ విషయాల్ని కామెడీ, సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తిక్-అర్జున్ దర్శకత్వం వహించారు. పాయింట్ బాగున్నప్పటికీ లాజిక్ లేని సీన్లతో విసిగించారు.'లేచింది మహిళా లోకం' విషయానికొస్తే.. నలుగురు మహిళలు (మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ) తన రోజూవారీ జీవితంలో పురుషాధిక్యత వల్ల చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక టైంలో వీళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. అప్పటివరకు మౌనంగా భరిస్తూ వచ్చిన వీళ్లు.. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? అని తిరగబడతారు. వీరిలోని ఈ మార్పు వల్ల ఇళ్లల్లో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పశ్చాత్తాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక) -
పుష్ప డైలాగ్ నాదే.. అందుకే చాలా ఫీలయ్యా: మంచు లక్ష్మీ
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ నటించిన తాజా చిత్రం లేచింది మహిళా లోకం. ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన మంచు లక్ష్మీ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ సినిమా పుష్ప-2 రిలీజ్‌కు కంటే పూర్తి చేశామని మంచు లక్ష్మీ తెలిపింది. పుష్ప చిత్రంలో వాడినా ఫ్లవర్ కాదు.. ఫైర్ అనే డైలాగ్ తాను ఈ చిత్రంలో వాడానని వెల్లడించింది. అయితే నా డైలాగ్ బయటికి రాలేదని పేర్కొంది. కానీ సుకుమార్ గారు ఈ డైలాగ్‌ను పుష్పలో వాడేశారని తెలిపింది. పుష్ప చూసినప్పుడు ఈ డైలాగ్ చూసి చాలా ఫీలయ్యానని మంచు లక్ష్మీ అన్నారు. ఆ డైలాగ్ ముందే వచ్చిందన్న విషయం అందరికీ తెలియజేస్తున్నానని మాట్లాడింది. కాగా.. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 26నే థియేటర్లలో సందడి చేయనుంది. #Pushpa2 release avvak mundhe ee cinema shooting complete ayipoyindi. Sukumar garu “Fire… Wild Fire” dialogue nenu first ee cinemalo vadanu.:- Actor మంచు లక్ష్మీ #LakshmiManchu #Alluarjun pic.twitter.com/ws6A0BODDb— Milagro Movies (@MilagroMovies) March 9, 2026 -
మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు
మంచు లక్ష్మీ మైక్ పట్టిందంటే చాలు.. ఏదో ఒకలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలానే తమ సినిమాని మగాళ్లు చూడకపోయినా పర్లేదని చెప్పి విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈమెతో పాటు అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'లేచింది మహిళా లోకం'. ఈనెల 26నే థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు)'మేం చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమాలు చేశామనమాట. ఇందులో ఇంతలా కామెడీ చేస్తానని అనుకోలేదు. నేను రెచ్చిపోయాను. కొన్ని డైలాగులు ఉండవని అనుకున్నా కానీ ఉన్నాయి. సీరియస్ సబ్జెక్ట్లని కామెడీగా చెబితేనే జనాలు వింటారు. సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఉంటుందేమో! మహిళలందరూ తమ తల్లి, నానమ్మ, అమ్మమ్మలతో వచ్చి మా సినిమా చూడండి. మగాళ్లు చూడకపోయినా పర్వాలేదు' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.అలానే ట్రైలర్లో వినిపించిన 'ఫిష్ అండ్ ఫిషర్ మెన్', 'లెట్ దెం నో' అనే డైలాగులు తన ప్రమేయం లేకుండానే సినిమాలో పెట్టేశారని లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు డైలాగుల్లో ఒకటి మోహన్ బాబుది కాగా రెండోది మంచు విష్ణుది. ఇక ట్రైలర్‌లోని వైల్డ్ ఫైర్ డైలాగ్ గురించి ప్రస్తావించిన ఈమె.. 'పుష్ప 2' రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. సుకుమార్ కంటే ఫైర్, వైల్డ్ ఫైర్ డైలాగ్ నేను మొదట ఈ సినిమాలో వాడాను. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం మానేశాను. కాబట్టి నా దగ్గరకు కథలు తీసుకురాకండి. యాక్టింగ్ కోసం మాత్రమే సంప్రదించండి అని చెప్పింది. ఒకప్పుడు మీడియా ముందు ఎలా ఉండాలా అని ఆలోచించేదాన్ని? ఇప్పుడు ఎలాంటి విమర్శలను, ట్రోలింగ్‌ని పట్టించుకోవడం లేదని తెలిపింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)


