ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్.. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పచ్చ నేతలు, పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు.. ఎన్నికల సందర్భంగా అనేక గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. దీంతో, అధికార కూటమికి ఆందోళన మొదలైంది.
ఎన్టీఆర్ జిల్లా
- జగ్గయ్యపేటలో టీడీపీకి భారీ షాక్.
- మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి రాకపోవడంతో రెండో వార్డు కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు మైనేని రాధాకృష్ణ పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా.
- వైస్ చైర్మన్ పదవిని జనసనేకు ఇవ్వడంపై మనస్తపానికి గురైన రాధాకృష్ణ
- 30 సంవత్సరాలు పార్టీకి సేవ చేస్తే పార్టీ తనకు చేసిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహం
- ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి.
బీజేపీలో అసంతృప్తి..
- విశాఖ..
- డిప్యూటీ మేయర్ చాన్స్ రాకపోవడంపై బీజేపీ అసంతృప్తి..
- బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కామెంట్స్..
- ఆశించిన స్థాయిలో కార్పొరేటర్లు ఇవ్వలేదు..
- కూటమి ధర్మం కోసం చేతులు కట్టుకుని కూర్చుండిపోయాం..
- మేయర్ రాకపోయినా డిప్యూటీ మేయర్ కోసం ఎదురు చూశాం..
- డిప్యూటీ మేయర్ అవకాశం కూడా రాకపోవడం అసంతృప్తిని మిగిల్చింది..
- కూటమి ధర్మం కోసం సర్దుకుపోవడం తప్పనిసరిగా మారింది..
అనంతపురం..
- తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్న జేసీ వర్గీయుల దాష్టీకం
- తాడిపత్రి మండలం దిగువపల్లిలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిపై కక్ష సాధింపు చర్యలు
- నామినేషన్ దాఖలు చేయాలని భావిస్తున్న సంగటి విజయలక్ష్మికి చెందిన బొలెరో వాహనానికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలు
- పోలీసుల ప్రేక్షక పాత్ర
వైఎస్సార్ జిల్లా..
- వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లిలో టీడీపీకి షాక్.
- ఎస్సీ కాలనీలో పలువురు కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ జడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి..
- వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బుక్కే రమేష్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన రవికుమార్ రెడ్డి..
జమ్మలమడుగులో పోలీసుల హైడ్రామా
- జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల హైడ్రామా
- ఎర్రగుంట్ల మండలం పెద్దన్న పాడు, వలస పల్లె గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు మెంబర్లు అభ్యర్థులను ముద్దనూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు
- ముద్దనూరు పోలీస్ స్టేషన్లో అభ్యర్థులను నిర్బంధించిన పోలీసులు
- నామినేషన్ వేయడానికి కోర్టు ఆర్డర్ ఉన్న పట్టించుకోకుండా అభ్యర్థులను అరెస్ట్ చేసిన ముద్దనూరు, ఎర్రగుంట్ల పోలీసులు
- జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసులే కూటమి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
అనంతపురం జిల్లా..
- బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఉద్రిక్తత.
- వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీటీసీ నాగయ్యపై గత రాత్రి టీడీపీ గుండాలు దాడి
- ఒంటరిగా వెళ్తున్న నాగయ్యను అడ్డగించి దాడి దిగిన టీడీపీ గుండాలు
- ఓటమి భయంతోనే దాడికి పాల్పడ్డారంటూ వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఆరోపణ.
- ఘటనతో చెన్నంపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు.
- సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
- గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత..


