సర్పంచ్‌ బరిలో తోడికోడళ్లు | Sisters In Law Contesting Against Each Other In Sarpanch Elections | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ బరిలో తోడికోడళ్లు

Nov 23 2026 11:21 AM | Updated on Nov 23 2026 11:22 AM

Sisters In Law Contesting Against Each Other In Sarpanch Elections

పల్నాడు: రొంపిచర్లలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. ఈ గ్రామ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వేషన్‌ అయ్యింది. దీంతో తోడికోడళ్లు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బండారు వీరాంజనేయులు (అంజి) భార్య శివలీల టీడీపీ మద్దతుతో బరిలో ఉన్నారు. ఆయన సోదరుడు బండారు నరసింహారావు (బుజ్జి) భార్య తిరుపతమ్మ వైఎస్సార్‌ సీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. గ్రామ చరిత్రలో ఒకే ఇంటికి చెందిన తోడికోడళ్లు ఇలా సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీ చేయడం ఇదే ప్రథమం. ఇది గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే ఈ నెల 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement