హైదరాబాద్ : నగరంలోని ఎనీ్టఆర్ స్టేడియం వేదికగా రచన టెలివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవంతో అత్యంత ఘనంగా వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుర మీనాక్షి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి చేసిన అనుగ్రహ భాషణం భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.
అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను విశేషం ఆకట్టుకుంది.


