హైదరాబాద్లో కోటి దీపోత్సవం-2026 వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు సభావేదికపై విశేష పూజలు, కల్యాణోత్సవాలు, అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, వాహన సేవలు మరియు ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి.
వేలాది మంది భక్తులు పాల్గొని దీపాలు వెలిగిస్తారు.


