రెండవ కార్తీక సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.
శివాలయాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పరమశివునికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణాల్లో, గంగాధర మండపాల్లో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు.


