శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం కోటిదీపోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా సాగింది. దేవస్థాన ఆగమ పాఠశాల వద్ద కై లాసపర్వత నమునాలో ప్రత్యేక వేదిక నిర్వహించారు. సాయంత్రం 6గంటల నుంచి కోటిదీపోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.
దీపోత్సవానికి కావాల్సిన పూజాద్రవ్యాలన్నింటిని దేవస్థానమే సమకూర్చింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ దీవిహయగ్రీవాచార్యులు..కోటిదీపోత్సవ విశేషాలను వివరించారు.
అలాగే సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం స్వామిఅమ్మవార్లకు దశవిధహారతులుగా ఓంకార హారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహాహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించారు.
అనంతరం ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకులు మనో, వారి బృందం వారిచే భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు.
చివరిగా మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనంతో కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని ముగించారు.


