సాక్షి, విజయనగరం: రాజాంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నాదెండ్ల నిర్వహించిన ప్రచార సభకు జనం పెద్దగా హాజరుకాకపోవడంతో సభ వెలవెలబోయింది. సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో మంత్రి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించినట్లుగా తెలుస్తోంది.
రాజాం సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందంటూ మంత్రి నాదెండ్ల ఆరోపణలు చేశారు. అనంతరం, ఆయనతో జనసేన నేతలు తమ గోడు వెల్లబోసుకున్నా నాదెండ్ల పట్టించుకోలేదని జనసైనికులు మండిపడుతున్నట్టు సమాచారం. అయితే, టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు చేసిన సిఫార్సు మేరకే జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థిని ఖరారు చేశామని మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో, పార్టీలో తమకు అన్యాయం జరిగిందంటూ ఓ జనసేన మహిళా కార్యకర్త మంత్రి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే సమయంలో జనసేనలో టీడీపీ పెత్తనం ఏమిటంటూ పలువురు జనసేన కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. ఇక, ప్రసంగం సందర్భంగా ఖాళీ కుర్చీలు కనిపించడంతో మంత్రి తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఉదయం ఓ మాట.. సాయంత్రం మరోమాట!


