ఉదయం ఓ మాట.. సాయంత్రం మరోమాట! | Jana Sena Issues Conflicting Statements on Alliance Contest in Panchayat Elections | Sakshi
Sakshi News home page

ఉదయం ఓ మాట.. సాయంత్రం మరోమాట!

Nov 23 2026 9:21 AM | Updated on Nov 23 2026 9:21 AM

Jana Sena Issues Conflicting Statements on Alliance Contest in Panchayat Elections

సాక్షి, అమరావతి:  గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ–జనసేన మధ్య వివాదం, జనసేన కార్యకర్త మృతి ఘటనపై జనసేన పార్టీ స్పందించింది. అయితే కూటమి పోటీపై పవన్‌ కళ్యాణ్‌ వైఖరికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. ఉదయం ప్రకటనలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా నామినేషన్లు వేసి పోటీ చేయవచ్చని, స్థానాల పంపకాలు ఉండవని స్పష్టం చేసింది. 

సాయంత్రం ప్రకటనలో మాత్రం కూటమి ఐక్యత స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చినట్లు పేర్కొంది. మరోవైపు, కడప జిల్లా చక్రాయపేట మండలం సురభి గ్రామ పరిధిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా జరిగిన గొడవలో జనసేన కార్యకర్త ముంతల వీరాంజనేయులు మృతి చెందడంపై పవన్‌ విచారం వ్యక్తం చేశారు.

 ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించడంతో పాటు, విచారణను పర్యవేక్షించాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సూచించారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు పార్టీ వెల్లడించింది.

ఇదీ చదవండి: షర్మిల వద్ద ఒక్క ఆధారమైనా ఉందా?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement