30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇదేనా గుర్తింపు? | TDP Woman Leader Nomination Rejection Incident | Sakshi
Sakshi News home page

30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇదేనా గుర్తింపు?

Nov 23 2026 7:34 AM | Updated on Nov 23 2026 7:39 AM

TDP Woman Leader Nomination Rejection Incident

రుయాలో చికిత్సపొందుతున్న హేమలతను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే నాని సతీమణి సుధారెడ్డి

సాక్షి, తిరుపతి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతో నామినేషన్‌ దాఖలు చేసిన ఓ టీడీపీ మహిళా నేతకు చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్‌ పరిశీలనలో తిరస్కరణకు గురికావడంతో మనస్తాపానికి గురైన తిరుపతి రూరల్‌ మండలం, లింగేశ్వరనగర్‌ పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్‌ మహిళా నేత హేమలత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. 

30 ఏళ్ల పార్టీ సేవకు దక్కిన ప్రతిఫలం ఇదేనా? 
మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ జెండా మోసి న తమకు ఎమ్మెల్యే నాని అన్యాయం చేశారని బాధిత అభ్యర్థి హేమలత ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన లింగేశ్వర నగర్‌ మాజీ సర్పంచ్‌ కోటేశ్వరరావు కుటుంబానికి సర్పంచ్‌ పదవి దక్కేలా ఏకగ్రీవానికి మార్గం సుగమం చేశారని ఆరోపించారు. తమ నామినేషన్‌ను తిరస్కరించి, ప్రత్యర్థులకు అవకాశం కల్పించారని హేమలత వర్గీయులు మండిపడ్డారు. సర్పంచ్‌ స్థానంతో పాటు హేమలత తరఫున వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసినవారందరివీ తిరస్కరణకు గురికావడంతో ఆమె ఆర్‌ఓను నిలదీశారు. అయితే తాము ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తున్నామని, మీరు ఏదైనా ఉంటే ఎమ్మెల్యేకు చెప్పాలని సంబంధిత ఆర్‌ఓ ఆమెకు చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబీకులు తెలిపారు.   

రూ.50 లక్షల బేరంపై ఆరోపణలు 
లింగేశ్వరనగర్‌ సర్పంచ్‌ పదవి విషయంలో రూ.50 లక్షల మేర ఎమ్మెల్యే నాని బేరం కుదుర్చుకుని, పార్టీ కోసం పనిచేసిన మహిళా నాయకురాలికి అన్యాయం చేశారని హేమలత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికే పదవులు కట్టబెడతారా? పార్టీ కోసం కష్టపడిన వారికి ఇదేనా మీరు ఇచ్చే గుర్తింపు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్ముకున్న నాయకులే తమను పట్టించుకోకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక హేమలత తీవ్ర మనోవేదనకు గురయ్యారని వారు వాపోయారు. 
 
ఏకగ్రీవం ఎలా చేస్తారు? 
లింగేశ్వరనగర్‌ పంచాయతీలో తమ నామినేషన్లను తిరస్కరించి అప్రజాస్వామికంగా ఆ సర్పంచ్‌ స్థానాన్ని ఏకగ్రీవానికి ఎలా తెరతీస్తారని హేమలత వర్గీయులు ప్రశ్నించారు. పంచాయతీకి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని, ఏకగ్రీవంగా ప్రకటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నామినేషన్‌ తిరస్కరణపై న్యాయం కోరుతూ కుటుంబ సభ్యులు శనివారం ఆర్డీవోను ఆశ్రయించినట్లు తెలిపారు.  

సుధారెడ్డిని నిలదీసిన బంధువులు 
తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ మహిళా నేతను పరామర్శించేందుకు ఎమ్మె ల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి రావడంతో ఉద్రి క్తత చోటుచేసుకుంది. అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను నిలదీశారు. టీడీపీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. పులివర్తి సుధారెడ్డి కారు ముందు హేమలత వర్గీయులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ప్రాణం పెట్టిన పనిచేసే వారిని గౌరవించకుండా ఇలా అడ్డదారుల్లో పారీ్టలోకి వచ్చే వారికి పదవులు వచ్చేలా చేయడానికి సీనియర్ల గొంతుకోస్తారా..? అంటూ నిలదీశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement