హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు | Efforts to arrest Dharani Krishna in jobs scam case | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు

Nov 23 2026 4:11 AM | Updated on Nov 23 2026 4:11 AM

Efforts to arrest Dharani Krishna in jobs scam case

జాబ్స్‌ స్కామ్‌ కేసులో ధరణి కృష్ణను పట్టుకునే ప్రయత్నాలు

ఏ1, ఏ2 అరెస్టులతో కేసు క్లోజ్‌ ?

ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారనేది నిగ్గుతేలుస్తారా?

సాక్షి, అమరావతి: జాబ్స్‌ స్కామ్‌ కేసులో ఏపీ సీఐడీ బృందాలు హైదరాబాద్‌లో ఆదివారం సోదాలు నిర్వహించాయి. ఈ కేసులో ఏ–1 నిందితురాలు ధరణి కృష్ణ హైదరాబాద్‌లో ఉందనే సమాచారంతో సీఐడీ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. జనసేన నాయకురాలు కోట రుక్మిణికి చెందిన కైరెన్‌ కన్సల్టెన్సీ హెచ్‌ఆర్‌(ఆపరేషన్స్‌) విభాగంలో పనిచేసిన ధరణి కృష్ణ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 36మంది నుంచి రూ.7కోట్లకుపైగా వసూలు చేసినట్టు కేసు నమోదైన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కోట రుక్మిణి, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కల్యాణం శివశ్రీనివాస్‌ (కేకే) ఫిర్యాదులు చేయడంతో మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. 

మోసపోయిన బాధితులు అప్పటికి ఫిర్యాదులు చేయకపోవడం, పలు జిల్లాలకు చెందిన బాధితులున్నప్పుడు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లోనే ప్రత్యేకంగా కేసులు నమోదు చేయడం వంటి అంశాల్లో ప్రజల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కలవరపడి ఆ కేసును ఏపీ సీఐడీకి అప్పగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ–1గా ఉన్న బోడపాటి ధరణి కృష్ణ, ఏ–2 నిమ్మకాయల పెద్దిరాజును అరెస్టుచేసి అక్కడితో కథ ముగించాలని సీఐడీ పోలీసులకు ఉన్నతస్థాయి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. 

న్యాయవాది కార్యాలయంలో తనిఖీలు
ఏ–2గా ఉన్న నిమ్మకాయల పెద్దిరాజును ఇప్పటికే హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. పెద్దిరాజు ద్వారా ధరణి కృష్ణ ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా తనపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని, తనకు ప్రాణహాని ఉందని, ఈ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారో పేర్లు భయటపెడతానని ధరణి కృష్ణ వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేయడంతోపాటు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ప్రకంపనలు రేపాయి. దీంతో ఆమె అరెస్టు గురించి సీఐడీపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి పెరిగిందని సమాచారం. ప్రస్తుతం ధరణి కృష్ణ హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి కూకట్‌పల్లిలోని ఓ న్యాయవాది కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియలేదని సమాచారం.

వీటిపై సీఐడీ దృష్టి పెట్టాలి
వాస్తవానికి ఈ స్కామ్‌లో నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.7కోట్లు ఎవరెవరి ఖాతాలకు చేరాయి? నగదు లావాదేవీలు? బ్యాంకు ఖాతాలు? కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు? నకిలీ నియామక పత్రాల తయారీ వెను­­క ఉన్న నెట్‌వర్క్‌ ఏమిటీ? ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉద్యోగుల వివరాలు నమోదైనట్లు చూపించడంలో ఎవరి పాత్ర ఉంది? అనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సీఐడీపై ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement