తాడేపల్లి : నేడు (సోమవారం) సత్యసాయి బాబా జయంతి సందర్భంగా భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ సత్యసాయి బాబా అని కొనియాడారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. https://t.co/NgVPDg8kve
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 23, 2026


