అల్లుడికి వెంకీమామ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్ | Hero Venkatesh Special Wishes To nephew Akkineni Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Venkatesh: అల్లుడికి వెంకీమామ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్

Nov 23 2026 10:35 AM | Updated on Nov 23 2026 10:42 AM

Hero Venkatesh Special Wishes To nephew Akkineni Naga Chaitanya

హీరో వెంకటేశ్ తన మేనల్లుడైన అక్కినేని నాగచైతన్యకు స్పెషల్ విషెస్ తెలిపారు. ఇవాళ చైతూ బర్త్‌ డే కావడంతో శుభాకాంక్షలు చెప్పారు. చైతూతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఎల్లప్పుడూ నీకు అంతులేని ఆనందం, మంచి ఆరోగ్యం, అపారమైన ప్రేమ లభించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం నాగచైతన్య జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వృషకర్మతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ డిసెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. మరోవైపు వెంకీమామ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న జనవరి 12న విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే ఈ చిత్రంలోని డివికి డివికి సాంగ్‌ రిలీజ్‌ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇవాళ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే కూడా కావడంతో వెంకీమామ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. కాగా.. నాగచైతన్య... వెంకటేశ్ సిస్టర్ లక్ష‍్మి కుమారుడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement