ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌.. నాకు కూడా హౌస్‌లో ఉండాలని లేదు..! | bigg boss reality show season 10 11th week sunday episode highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌.. నాకు కూడా హౌస్‌లో ఉండాలని లేదు..!

Nov 23 2026 7:35 AM | Updated on Nov 23 2026 7:35 AM

bigg boss reality show season 10 11th week sunday episode highlights

బిగ్‌బాస్ రియాలిటీ షో 11వ వారం పూర్తి చేసుకుంది. ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున సందడి చేశారు. ప్రతివారంలో ఓ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ ఉండనే ఉంటోంది. అలా వారంలో కూడా వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నీతూమాస్టర్ హౌస్‌ నుంచి బయటకొచ్చేశారు. నామినేషన్స్‌లో నరేశ్ మినహా అందరూ ఉన్న సంగతి తెలిసిందే. చివర్లో అందరూ సేఫ్‌ కాగా.. సుధీర్, నీతూ మాత్రమే నిలుస్తారు. వీరిద్దరిలో నీతూ ఎలిమినేట్ ‍అయినట్లు నాగార్జున ప్రకటిస్తారు. ఈ సండే ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఓసారి చూసేద్దాం.

అయితే ఈ సండే ఎపిసోడ్‌లో ఇద్దరిని ఓ గ్రూపుగా విభజించి వారి మధ్య పోటీ పెట్టారు. ఎవరు గెలిస్తే వాళ్లు వచ్చేవారంలో కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ పోటీలో నిలుస్తారని నాగ్ చెప్పారు. అలా నెక్ట్స్ వీక్‌ కెప్టెన్ కంటెండర్‌షిప్‌ పోటీలో ఆర్కే, దేబ్జానీ, త్రిగుణ్, రామ్‌ప్రసాద్, శివ నిలిచారు. అయితే ఈ ఎపిసోడ్‌లో రష్మిక మందన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మైసా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మందన్నా బిగ్‌బాస్ హౌస్‌లో మెరిసింది. కంటెస్టెంట్లను అందరూ బాగా ఆడుతున్నారంటూ కొనియాడింది. రష్మికతో చిన్న గేమ్‌ ఆడించాడు నాగ్. ఏదైనా సినిమాలో పాట, డైలాగ్ వినిపించడం..కరెక్ట్‌గా చెప్పినవాళ్లకు రష్మిక మార్కులు వేయడం ఫుల్ ఫన్నీగా సాగింది. అలా ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ సరదాగా సాగింది. రష్మికతో ముకేశ్, శివ కన్నడలో మాట్లాడటం ఆసక్తిగా అనిపించింది. కాలేజ్‌లో నువ్వు నా జూనియర్ అని రష్మికతో ముకేశ్ చెప్తాడు. మీరు చాలా అందంగా ఉన్నారు అని కన్నడలో శివ్ మాట్లాడుతూ రష్మికను పొగిడేస్తాడు. ఆ తర్వాత రష్మిక చేతుల మీదుగా ముకేశ్, వంశీ సేఫ్ అయినట్లు ప్రకటిస్తారు.

నెక్ట్స్‌ వీక్ కంటెండర్‌షిప్‌ కోసం ఇద్దరిద్దరూ పోటీ పడతారు. వంశీ, త్రిగుణ్‌ పోటీపడగా.. త్రిగుణ్ గెలుస్తాడు. నరేశ్, రామ్‌ప్రసాద్‌ పోటీపడగా.. రామ్ ప్రసాద్‌ విన్ అవుతాడు. అమన్, శివ మధ్య పోటీలో శివ విజేతగా నిలుస్తాడు. సుధీర్, ఆర్కే పోటీపడగా.. ఆర్కే గెలిచి తన ఆనందాన్ని గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. హౌస్‌ ఇది నా ఫస్ట్ విన్ అని ఎమోషనలవుతాడు. దేబ్జానీ, నీతూకి పోటీపడడంతో.. దేబ్జానీనే విన్నర్‌గా నిలుస్తుంది. అలా త్రిగుణ్, రామ్ ప్రసాద్, ఆర్కే, శివ, దేబ్జానీ 12వ వారం కెప్టెన్ కంటెండర్‌షిప్ పోటీలో నిలుస్తారు.

ఇక చివర్లో అందరూ సేఫ్‌ కాగా.. సుధీర్, నీతూమాస్టర్‌ మాత్రమే నిలుస్తారు. వాళ్లిద్దరిని గార్డెన్ ఏరియాకు పంపిస్తాడు నాగ్. తిరిగి ఇంట్లోకి ఎవరు వస్తారో వారు సేఫ్.. రానివారు ఎలిమినేట్ అవుతారని నాగ్ చెప్తాడు. సుధీర్ వస్తాడని వంశీ, నరేశ్, రాం ప్రసాద్ అంటారు. మిగిలిన వారంతా నీతూ వస్తుందని చెప్తారు. కానీ చివరకు సుధీర్ తిరిగి ఇంట్లోకి వస్తాడు. నీతూ ఎలిమినేట్ అయి బయటికి వచ్చేస్తుంది. ఎంత కొట్టినా చావని పామువిరా నువ్వు అని సుధీర్‌పై నరేశ్, రాం ప్రసాద్ పంచ్‌ వేస్తారు.

హౌస్‌నుంచి బయటికొచ్చిన నీతూ.. నాకు కూడా హౌస్‌లో ఉండాలని లేదు సార్.. ఎందుకంటే నేను అలా అరవలేను.. గొడవలు పెట్టుకోలేనని నాగార్జునతో చెబుతుంది. తన జర్నీని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. హౌస్‌లో అమన్, శివ్, త్రిగుణ్ ఫుల్ ట్యాంక్‌ అని వంశీ, సుధీర్, ముకేశ్ ఖాళీ ట్యాంక్ అని నీతూ తన అభిప్రాయం చెబుతుంది. ఇప్పటికైనా నీ ఆట నువ్వు ఆడు.. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో అంటూ ముకేశ్‌కు సలహా ఇస్తుంది. ఇక వచ్చేవారానికి బడ్డీ అప్ అనే పేరు రివీల్ చేయడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement