రష్మిక మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ మైసా. ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో విజయశాంతి ఓసేయ్ రాములమ్మ సాంగ్‌ను రీమిక్స్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.
కానీ తాజాగా రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. మైసా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్స్మ్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. మైసాను మరింత అద్భుతమైన అనుభూతి కలిగించేలా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే నవంబర్ 27న విడుదల కావాల్సిన చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం.. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ట్వీట్ చేశారు. అప్పటివరకు ఓసేయ్ రాములమ్మ సాంగ్ మిమ్మల్ని అలరిస్తూ ఉంటుందని పోస్ట్ చేశారు. దీంతో ఈ వారంలో బాక్సాఫీస్ పోటీ నుంచి మైసా తప్పుకున్నట్లే.
We wish to present the world of #MYSAA in its most uncompromised form, delivering the experience it truly deserves. With this vision in mind, the theatrical release of #MYSAA, originally scheduled for NOVEMBER 27th, has been POSTPONED. The new release date will be announced very soon. Until then, keep the energy alive and groove to the rage-filled #OseyRamulamma ❤️🔥🎶 — https://t.co/TKCU7BiuaN @iamRashmika @RawindraPulle @unformulafilms @TSeries @tseriessouth
— UnFormula Films (@unformulafilms) November 22, 2026


