కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యమారన్‌ను ఆయన పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక గ్రీస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి కోలీవుడ్ ప్రముఖ సినీతారలు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. తాజాగా ఈ జంట చెన్నైలో రిసెప్షన్ నిర్వహించారు. ఇండస్ట్రీ ప్రముఖుల కోసం అనిరుధ్-కావ్య ఈ వేడుక ఏర్పాటు చేశారు.
ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుకలో సీఎం విజయ్ కూడా సందడి చేశారు. నూతన వధువరులను దళపతి ఆశీర్వదించారు. అదే సమయంలో ఈ ఈవెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇదే కార్యక్రమానికి ఆయన భార్య సంగీత కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య విడాకుల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఓకే ఈవెంట్‌కు హాజరవ్వడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ సీఎం అయ్యాక ఆమె తన విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో వీరిద్దరు మళ్లీ కలుస్తారనే చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. తాజాగా విజయ్, సంగీత ఈ రిసెప్షన్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
అయితే సంగీత చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. ఇటీవలే విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సిగ్మాతో అరంగేట్రం చేశారు. కాగా.. విజయ్-సంగీత 1999 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.


