ఆ పని మేము కూడా చేయాల్సి వస్తోంది: అనిల్ రావిపూడి | Director Anil Ravipudi comments at high pre release event | Sakshi
Sakshi News home page

Anil Ravipudi: పెద్ద డైరెక్టర్స్ కూడా చేయాల్సి వస్తోంది: అనిల్ రావిపూడి

Nov 22 2026 9:34 AM | Updated on Nov 22 2026 9:35 AM

Director Anil Ravipudi comments at high pre release event

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకులను ‍అలరించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ హీరోగా మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో హిట్‌ కొట్టేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జనవరి 12న విడుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

ఇదిలా ఉండగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఓ హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సినిమాను ఇన్‌ఫ్లూయన్సర్లు కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని అన్నారు. ఈ రోజు ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నారని తెలిపారు.  పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. నేను కూడా నా సినిమాను ప్రమోట్ చేయడానికి రీల్స్ చేస్తున్నానని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఈ సినిమా నవంబర్ 27న రిలీజవుతోంది..అందరూ కూడా చూడాల్సిన మూవీ అని అన్నారు. నా లైఫ్‌లో నాకు నచ్చిన హై... బాగా ఇచ్చే హై... సంక్రాంతి అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement