విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన లేటేస్ట్ సీక్వెల్ మూవీ ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). ఈ మూవీకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఈఎన్‌ఈ రిపీట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా నవంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది.
(ఇది చదవండి: ఓటీటీకి దృశ్యం-3.. అఫీషియల్ ప్రకటన)
రిలీజైన మొదటి రోజే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సీక్వెల్.. రెండో రోజు అదే జోరు కొనసాగించింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.23.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.
The gang is making every day count and riding high on a BLOCKBUSTER HIGH 💥💥 #ENERepeat hits 23.12Cr+ Worldwide Gross in 2 Days ❤️🔥❤️🔥 #BlockbusterENERepeat #ENE2 #TharunBhascker @VishwakSenActor @AbhinavGomatam @maganti_srinath #VenkateshKakumanu @anishaambrose @ShivathmikaR #VivekSagar @SOriginals1 @rootnodecinema @EneRepeat @thinkmusicindia
— ENE Repeat (@ENERepeat) November 21, 2026


