'ఓసేయ్ రాములమ్మ.. ఆ పేరు చెప్పగానే భయమేసింది' | Rashmika Comments at Mysaa Movie Song Release event | Sakshi
Sakshi News home page

Rashmika: 'ఓసేయ్ రాములమ్మ.. ఆ పేరు చెప్పగానే భయమేసింది'

Nov 21 2026 9:50 AM | Updated on Nov 21 2026 9:50 AM

Rashmika Comments at Mysaa Movie Song Release event

రణబాలి తర్వాత వస్తోన్న రష్మిక మరో చిత్రం మైసా. ఈ లేడీ ఓరియంటెడ్‌ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాలోని క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ పాటను విజయశాంతి ఓసేయ్ రాములమ్మ పాటను రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ మరోసారి రాములమ్మ మూవీని గుర్తుకు తెస్తోంది. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌కు రష్మిక మందన్నా కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ సినిమాలో ఓసేయ్ రాములమ్మ సాంగ్ రీమిక్స్ చేస్తున్నామని చెప్పినప్పుడే నాలో భయం మొదలైందని రష్మిక తెలిపింది. ఎందుకంటే ఐకానిక్ మూవీలోని ఐకానిక్ సాంగ్‌ రి క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద సాహసమని అన్నారు. కానీ ఒరిజినల్ పాటను మ్యాచ్ చేయలేమని వెల్లడించారు. ఈ రోజు విజయశాంతి మేడమ్ ఇక్కడే ఉంటే చాలా బాగుండేదన్నారు. మీరు చాలా బిజీగా ఉంటారని మాకు తెలుసు.. 1997లో వచ్చిన మీ మూవీ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిందని మాకు తెలుసని రష్మిక ప్రశంసించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement