వాస్తవ సంఘటనల ఆధారంగా... | Unexpected Safed Sach first look poster released | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనల ఆధారంగా...

Nov 21 2026 3:43 AM | Updated on Nov 21 2026 3:43 AM

Unexpected Safed Sach first look poster released

సంజయ్‌ కపూర్, ఎస్తేర్‌ అనిల్, ప్రశాంత్‌ నారాయణన్‌ నటిస్తున్న చిత్రం ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్‌–సఫేద్‌ సచ్‌’. నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీ రాజ్, తంబి రామయ్య, సంజయ్‌ సింగ్, గంజా కరుప్పు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ప్యారేలాల్‌ గుండెచా నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, గర్వాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ‘‘ఇంట్లో పెట్టిన ఒక ప్రేమలేఖ కారణంగా జరిగిన అపార్థంతో ఒక టీనేజ్‌ అమ్మాయి అదృశ్యం కావడమే ఈ సినిమా కథాంశం. 

ఆమె డెహ్రాడూన్‌ ఐఎస్‌బీటీ నుంచి రాత్రి బస్సు ఎక్కి అదృశ్యమవ్వడంతో ఈ సంఘటన కలవరపరిచే మలుపు తీసుకుంటుంది. ఒక సున్నితమైన కేసు వెనక ఉన్న నిజాన్ని వెలికి తీయడంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలు ఎదుర్కొనే సవాళ్లను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. 

కేవలం ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ను ప్రదర్శించడమే కాకుండా, మహిళల భద్రతను, మానవ గౌరవాన్ని కాపాడటం పట్ల ఉన్న సామాజిక బాధ్యతను ఈ కథనం హైలైట్‌ చేసేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ‘‘మహిళల భద్రత, సామాజిక బాధ్యత, పోలీసింగ్‌ ్రపాముఖ్యతలను హైలైట్‌ చేయాలన్నదే మా అభిమతం’’ అని ‘గరుడవేగ’ అంజి, ప్యారేలాల్‌ గుండేచా, సంజయ్‌ కపూర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement