గంగూభాయి కతియావాడి కాంబో.. మరోసారి రిపీట్..! | Alia Bhatt First Look From Sanjay Leela Bhansali Love and War | Sakshi
Sakshi News home page

Alia Bhatt: గంగూభాయి కతియావాడి కాంబో.. మరో బ్లాక్‌బస్టర్‌ కొడతారా?

Sep 25 2026 6:38 PM | Updated on Sep 25 2026 6:55 PM

Alia Bhatt First Look From Sanjay Leela Bhansali Love and War

గంగూభాయి కతియావాడి మూవీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. ఆలియా భట్ ప్రధానపాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ.. ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం లవ్ అండ్ వార్. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

(ఇది చదవండి: 'నన్ను అవమానించినా ఫర్వాలేదు..':..యాంకర్ రష్మీ స్ట్రాంగ్ కౌంటర్)

తాజాగా అలియా భట్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో మెరిసింది.  స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నంగా ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాద జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement