ఎలక్ట్రీషియన్‌ నుంచి మాస్టర్‌ చెఫ్ విజేత, రెస్టారెంట్‌ యజమాని రేంజ్‌కి..! | Andy Allen: From Electrician To MasterChef Australia Judge Restaurateur | Sakshi
Sakshi News home page

Andy Allen Success Story: ఎలక్ట్రీషియన్‌ నుంచి మాస్టర్‌ చెఫ్ విజేత, రెస్టారెంట్‌ యజమాని రేంజ్‌కి..!

Sep 25 2026 2:06 PM | Updated on Sep 25 2026 3:13 PM

Andy Allen: From Electrician To MasterChef Australia Judge Restaurateur

ఒక వ్యక్తి చిన్న ఉపాధితో కెరీర్‌ని ప్రారంభించి.. అనూహ్యంగా వేరే రంగంలోకి యూటర్న్‌ తీసుకుని అనితర సాధ్యమైన సక్సెస్‌ని అందుకుని యువతకు స్ఫూర్తిగా మారాడు. కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చినా సంశయం వద్దు..ధైర్యంగా ముందుకు సాగు, కష్టాన్ని నమ్ముకున్నవాడికి ఓటమి ఉండదు అని చాటి చెబుతున్నాడు. అంతేగాదు విజయానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. తెలియని విభిన్న రంగంలో కూడా అంచలంచెలుగా ఎలా ఎదగొచ్చో చూపించి ప్రేరణగా మారాడు. 

అతడే ఆండీ అలెన్‌ మాస్టర్‌ చెప్‌.  ఆస్ట్రేలియాకు చెందిన అతడి కెరీర్‌ ప్రయాణం 23 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో అతనికేమి పాకశాస్త్రంలో నైపుణ్యం లేదు. పైగా అతడు న్యూకాజిల్‌ అనే గ్రామంలో ఎలక్టీషియన్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆస్ట్రేలియా టెలివిజన్‌ కుకింగ్‌ షోకి అప్లై చేశాడు. పోనీ అలెన్‌ వంటకాలు చేయడంలో దిట్ట కూడా కాదు. కనీసం అనుభం కూడా లేదు. పైగా యువకుడిగా ఆ షోలో పాల్గొన్నాడు. 

అందులో ఉన్నవాళ్లందరికంటే తనేమి బాగా వండలేనన్న విషయం తెలుసు కాబట్టి ప్రతీ వంటకం గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటూ తన వంటకాలన్నింటినీ ప్రెజెంట్ చేసేవాడు. అదీగాక మిగతా పోటీదారులంతా ఎలాగో సిద్ధహస్తులు కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉంటూ..పోటీలో ఉండే ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగినట్లు తెలిపాడు. కట్‌చేస్తే అతడే మాస్టర్‌చెఫ్‌గా ఆ షో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత మాస్టర్‌ చెఫ్‌గా కొద్ది రోజులకే తనకు అవకాశాలు తగ్గిపోవడం మొదలైంది. అలాగే ఈలోగా కొత్త మాస్టర్‌ చెఫ్‌గా మరో విజేత రావడం మళ్లీ పరిస్థితి మొదటికొచ్చేసింది అలెన్‌కి. 

దాంతో మళ్లీ ఎలక్ట్రిషియన్‌గా కొనసాగుదాం అనుకున్న టైంలోనే..ఆహారం గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటూ.. త్రీ బ్లూ డక్స్ రెస్టారెంట్‌లో చేరాడు. ఆ రెస్టారెంట్ గ్రూప్ వ్యవస్థాపకులు తను పాల్గొన్న షోకి గెస్ట్‌ చెఫ్‌లుగా  రావడంతో వాళ్ల నుంచి మరిన్ని వంటకాల గురించి తెలుసుకునే వీలు ఉంటుంది, అలాగే వాళ్ల పనితీరు కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. రెండు వారాల పని అనుభవం కోసం అలెన్‌ వెళ్తే..అది కాస్తా పూర్తికాల ఉద్యోగంగా మారింది. 

కొన్ని నెలల తర్వాత, రోజ్‌బెరీలోని  230-సీట్ల త్రీ బ్లూ డక్స్ రెస్టారెంట్‌కి హెడ్ చెఫ్ అయ్యాడు . ఇది ఆ గ్రూప్ 50-సీట్ల సముద్రతీర కేఫ్ నుంచి ఒక పెద్ద ముందడుగు. అయితే ఈ పదోన్నతి అలెన్‌ని విపరీతమైన ఆందోళనకు గురిచేసింది.  అయినప్పటికీ..ఎప్పటిలానే తన పనితీరుతో ఆకర్షించుకోవాల్సిందే అంటూ ముందుకు సాగాడు. అలా  2015లో అధికారికంగా ఆ రెస్టారెంట్‌ గ్రూప్‌లో భాగమయ్యాడు. అదీగాక ప్రస్తుతం త్రీ బ్లూ డక్స్ ఒక బహుళ-వేదికల రెస్టారెంట్ గ్రూప్‌గా ఎదిగింది. ఇప్పుడతని తాజా ప్రాజెక్ట్, 'త్రీ బ్లూ డక్స్ ఎట్ బురాడూ'. 

ఇది తాజాగా పండిన వ్యవసాయ ఉత్పత్తులతో కూడిన ఏడు మెనూలను అందిస్తుంది. అంతేగాదు ఆ రోజు ఏం ఆహారాలు పండాయో దాని ఆధారంగా మెనూ సిద్ధమవుతుంది. అలా అలెన్‌ ఆ రెస్టారెంట్‌ గ్రూప్‌కి సహా యజమాని స్థాయికి చేరుకున్నాడు. అతడి ధ్యాసంతా ఆ రెస్టారెంట్‌ని మరింత వృద్ధిలోకి తీసుకురావడమే. అలాగే ఈ రెస్టారెంట్‌కి మరిన్ని రెస్టారెంట్ల బ్రాంచ్‌లని జోడించి.. ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేగాదు తాను పాల్గొన్న అదే కుకింగ్‌ షోకి న్యాయనిర్ణేతగా వ్యహరించే స్థాయికి చేరాడు. 

అంతేగాదు పోటీదారుడికి ఎంత ఒత్తిడి ఉంటుందో అలెన్‌కి బాగా తెలుసు, అలాగే జడ్డిగా తన తీసుకున్న నిర్ణయం పోటీదారుడి భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా బాగా తెలుసు. అందుకే పోటీదారుల పట్ల ఉన్న అభిప్రాయాలను పక్కన పెట్టి కేవలం రెసిపీలనే పక్కనే పెట్టే ప్రయత్నం చేస్తూ జడ్జిమెంట్‌ ఇస్తాడట. 

అంతేగాదు పోటీదారుడిగా, న్యాయనిర్ణేత వ్యవహరించడం వల్ల వంటకాల గురించి మరింత లోతుగా తెలుసుకోగలిగానని, అది తన రెస్టారెంట్లను మరింత విజయవంతంగా రన్‌ చేసేందుకు దోహదపడిందని చెబుతున్నాడు అలెన్‌. ఇతడి కథ ప్రతి ఒక్కరికి కెరీర్‌ గొప్ప మలుపు తిరిగి సక్సెస్‌ తలుపు తట్టినా..అవకాశాలు రావు, కానీ మనమే దాన్ని అందిపుచ్చుకుంటే..గెలుపు సదా మన వెంట ఉండి తీరుతుందని అలెన్‌ కథ చెబుతోంది కదూ..!.

ఇదీ చదవండి:  బొటిక్‌ వ్యాపారం చేస్తున్న మాజీ ఐఏఎఫ్‌ అధికారిణి!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement