కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కాదని క్యాప్సికమ్‌ సాగు..! ఇవాళ ఏకంగా.. | MBA Graduate Left Corporate Job Start Capsicum Farming Earns Rs 4 crore | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కాదని క్యాప్సికమ్‌ సాగు..! ఇవాళ ఏకంగా..

Sep 22 2026 4:49 PM | Updated on Sep 22 2026 4:49 PM

MBA Graduate Left Corporate Job Start Capsicum Farming Earns Rs 4 crore

క్యాప్సికమ్‌ ఎంత టేస్టీగా ఉంటుందో తెలిసిందే. కడాయి పనీర్‌ నుంచి ఫ్రైడ్‌ రైస్‌ వరకు విభిన్న వంటకాల్లో దీని డిమాండ్‌ వేరేలెవెల్‌. అలాంటి క్యాప్సికమ్‌ని ఎలా సాగు చేస్తారో తెలుసా..మాములు కూరగాయలు పండించినట్లుగా మాత్రం కాదు. దీని గురించి పూర్తిగా తెలుసకునే ఈ సాగుకి దిగాలి. కానీ ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ ఆ సాహసం చేసి కోట్లు లబ్ధి పొందుతోంది. మరి ఆమె ఎలా ఈ వ్యసాయం రంగాన్ని ఎంచుకుని లాభాలు గడిస్తుందో చూద్దామా..!.

ఆ యువతే మహారాష్ట్రలోని జున్నార్‌లో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందింది ప్రణితి వామన్‌. ఎంబిఏ గ్రాడ్యుయేట్‌ అయిన ప్రణిత కార్పొరేట్‌ ఉద్యోగాల వైపుకి మళ్లకుండా..నేల తల్లి వైపే అడుగులు వేసింది. అంతేగాదు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నుంచి ఎంబీఏ చేసిన వెంటనే ఫుడ్‌ప్రాసెసింగ్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసింది. 

అయినా కూడా కార్పొరేట్‌ ఉద్యోగం వద్దనుకుని వ్యవసాయం రంగంలోకి వెళ్లేందుకే మొగ్గు చూపింది. తన ఇంటర్న్‌షిప్‌ సమయంలోనే వ్యవసాయ-పారిశ్రామికవేత్తగా మారాని భావించిందట. అదే తన లక్ష్యంగా ఏర్పరుచుకుని మరి ఈ ఫీల్డ్‌లోని వచ్చింది ప్రణిత. ఆమె  హై-టెక్ వ్యవసాయంలోని సామర్థ్యాన్ని గుర్తించి..2020లో కేవలం ఒక ఎకరం భూమిలో పాలీహౌస్‌లో క్యాప్సికమ్‌ సాగుని ప్రారంభించింది. ఫాలీహౌస్‌ సాగులో ఉష్ణోగ్రత, తేమ, ఇతర అంశాలను నియంత్రించడం ద్వారా పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తారు. ఈ పద్ధతి కొన్ని పంటలను ఏడాది పొడవున పండించేందుకు వీలు కల్పిస్తుందట. 

అలా ఆమె బ్రోకలీ, లెట్యూస్‌ వంటి కూరగాయలను పరిశీలించి ఆ తర్వాతే క్యాప్సికమ్‌ పండించాలని నిర్ణయించుకుందట. రెస్టారెంట్‌, హోటళ్లలో దీని డిమాండ్‌ చూసి ప్రణితి ఈ కూరగాయను సాగు చేయాలని నిర్ణయించుకుందామె. లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల ముందు నుంచి మార్చి 2020లో క్యాప్సికమ్‌ సాగుని ప్రారంభించింది. నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి విత్తనాలు కొనడానికి ఇతర అవసరాల కోసం సుమారు రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టింది. తన వ్యాపార ఆలోచనను ప్రారంభించేందుకు అవసరమైన మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో పొందింది ప్రణిత. 

ఇంత కష్టపడితే..సరిగ్గా పంట కోత సమయానికి లాక్‌డౌన్‌ రావడంతో హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారుల గురించి తెలుసుకోవడం కష్టమైపోయింది. ఆ సమయంలో రైతులంతా సాగుని నిలిపేయడంతో కూరగాయలను కొనుగోలు చేసే వ్యాపారిని గుర్తించడానికి ఎన్నో పాట్లు పడింది. చివరికి ఎంతో శ్రమించి ఒక వ్యాపారిని గుర్తించి తన పంటను అమ్మే ప్రయత్నాలు చేసింది. 

అలా ఆమెకు మొదటి పంటలో 40 టన్నుల క్యాప్సికమ్ దిగుబడి రాగా, రూ. 32 లక్షల టర్నోవర్‌ ఆర్జించింది. ప్రస్తుతం ఆమె ఈ పంటతో ఏడాదికి రూ. 4 కోట్లు టర్నోవర్‌ ఆర్జిస్తోంది. దానిలో రూ. 2.25 కోట్లు లాభాలను అందుకోవడం విశేషం. ఇక ప్రణిత తన ఉత్పత్తులను నాసిక్‌, దాదర్‌, జైపూర్‌ తదితర ఇతర ప్రాంతాల్లోని టోకు వ్యాపారులకు నేరుగా విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: ఆ రెస్టారెంట్‌లో మెనూనే ఉండదట..! ఫుడ్‌ ఎలా ఆర్డర్‌ చేస్తారంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement