తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.
స్వామివారు రథంపై విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా హారతులు సమర్పిస్తూ, “గోవిందా.. గోవిందా” అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి డింపుల్ హయాతి


