వైరల్ వీడియో: మరిగే చాయ్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్! | iPhone 18 Pro Max Boiled In Tea For 3 Minutes Viral Video Shows Result | Sakshi
Sakshi News home page

వైరల్ వీడియో: మరిగే చాయ్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్!

Sep 22 2026 10:13 AM | Updated on Sep 22 2026 10:14 AM

iPhone 18 Pro Max Boiled In Tea For 3 Minutes Viral Video Shows Result

కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌పై ఓ వింత పరీక్షకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరిగే చాయ్‌లో ఐఫోన్‌ను దాదాపు మూడు నిమిషాల పాటు ఉంచారు. ఆ తర్వాత ఫోన్ పరిస్థితి ఎలా ఉందో చూపించారు. యాపిల్‌ సంస్థ ఇటీవల ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. తొలి విక్రయాలు ప్రారంభమైన సమయంలోనే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన ఈ వింత పరీక్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన ఉన్న చాయ్ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను కెమెరా ఆన్ చేసి పరీక్షించారు. అనంతరం మరుగుతున్న చాయ్‌లో ఫోన్‌ ఉంచారు. కొత్త ఐఫోన్‌లో థర్మల్ ప్రొటెక్షన్ ఎలా పనిచేస్తుందో చూడటమే ఈ పరీక్ష ఉద్దేశమని వీడియోలో తెలిపారు. మూడు నిమిషాల అనంతరం ఫోన్‌ను బయటకు తీశారు. ఆ ఫోన్‌లోకి తేమ వెళ్లినట్లు తెలియజేశారు. ఫోన్‌ను బయటకు తీసిన తర్వాత నీటితో శుభ్రం చేసి, మళ్లీ ఉపయోగించేందుకు ప్రయత్నించారు. కెమెరాను ఆన్ చేసి ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఫోన్ కొంతవరకు పనిచేసినట్లు చూపించినప్పటికీ, మరిగే చాయ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడం  మంచిది కాదు. అధిక ఉష్ణోగ్రత, ద్రవం, ఆవిరి వంటి పరిస్థితులు ఎలక్ట్రానిక్ పరికరానికి నష్టం కలిగిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement