breaking news
boiled alive
-
తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!
కొన్ని కూరగాయలను కచ్చితంగా ఉడకించే తినడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. చాలా వరకు క్యారెట్, టమటా వంటివి పచ్చిగా తినేస్తాం. అయితే ఆ విధమైన కూరగాయలను ఉడికించి తింటేనే మనకు మంచి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. పైగా మన శరీరం కూడా సులభంగా పోషకాలను గ్రహిస్తుంది. తినే ముందు ఉడకబెట్టడం వల్ల ప్రయోజనం పొందగలిగే కూరగాయ లేవంటే..క్యారెట్లుఉడకబెట్టిన క్యారెట్లు సెల్ గోడలను విచ్ఛిన్నం చేస్తాయి. బీటా-కెరోటిన్ జీవ లభ్యతను పెంచి శరీరానికి కావాల్సిన విటమిన్ 'ఏ'ని అందిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.బచ్చలికూరబచ్చలికూర ఉడకబెట్టడం వల్ల ఆక్సాలిక్ ఆమ్లం తగ్గుతుంది. ఈ ఆక్సాటిక్ ఆమ్లం కాల్షియం, ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల ఉడికిస్తే..మరిన్ని మినరల్స్ శరీరానికి అందుతాయి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహించి, రక్తహీనతను నివారిస్తుంది.బ్రోకలీబ్రోకలీని ఉడకబెట్టినప్పుడు దానిలోని కొన్ని పదార్ధాల గాఢతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సీ, కెలు అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ, చర్మ ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.టోమాటోలు..టొమాటోలను ఉడకబెట్టడం వల్ల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ లభ్యత పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. పైగా దీనిలో శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.బీట్రూట్లుఉడకబెట్టిన దుంపలు నైట్రేట్లను సంరక్షిస్తాయి, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి , రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వ్యాయామ పనితీరును మెరుగుపరిచి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.చిలగడదుంపలుతీపి బంగాళాదుంపలను ఉడకబెట్టినప్పుడు, బీటా కెరోటిన్ వంటి అధిక స్థాయిలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఉడికించిన చిలగడదుంపలను తీసుకోవడం వల్ల దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.గ్రీన్ బీన్స్ఉడకబెట్టిన పచ్చి బఠానీలు వాటిలోని ఫైబర్‌ను జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. అంతేగాక దీనిలో విటమిన్లు ఏ, సీ, కే వంటి విటమిన్లు ఉడకబెట్టినా.. నిలుపుకుంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.ఆస్పరాగస్ఉడకబెట్టిన ఆస్పరాగస్ని తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు జీవ లభ్యతను పెంచి, ఆక్సాలిక్ యాసిడ్ వంటి యాంటీ-న్యూట్రియంట్స్ కంటెంట్‌ను తగ్గిస్తుంది. ఉడకబెట్టిన ఆకుకూర, తోటకూరలో విటమిన్ ఏ, సీ, ఇ, కే అధికంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక పనితీరుకు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.బ్రస్సెల్స్ మొలకలుఉడకబెట్టడం వల్ల చేదు తగ్గుతుంది. బ్రస్సెల్స్ మొలకలలో గ్లూకోసినోలేట్లు (క్యాన్సర్ నివారణలో ప్రయోజనకరంగా ఉంటాయి) మరింత జీవ లభ్యతను కలిగిస్తాయి. ఇందులో విటమిన్లు సీ, కే, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక పనితీరుకు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.బంగాళదుంపలుఉడకబెట్టడం వల్ల బంగాళాదుంపల్లోని గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది. ఉడికించిన బంగాళదుంపల్లో విటమిన్ సీ, బీ 6 వంటి విటమిన్ల ఉంటాయి. అవి శక్తిని అందిస్తాయి, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.ఈ ఉడికించిన ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పోషకాల శోషణను మెరుగుపరచడం తోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు. అయితే అతిగా ఉడకబెట్టడం వల్ల పోషకాల నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ఓ మోతాదు వరకు ఉడకబెట్టి తీసుకుంటే మంచిది. -
జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!
జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో క్రీమ్‌లు, కండిషనర్లు వాడి ఉంటారు. వాటన్నిటికంటే బట్టటకు పెట్టే గంజి బెటర్. ఇదేంటి గంజినా అనుకోకండి. ఎందుకుంటే బియ్యం వార్చిన గంజితో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే.. ఈ గంజిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. ఈ గంజినీరు జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మృదువుగా మెరిసేలా చేయడంలో గంజినీరుకి మించిది మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పొడి జుట్టువారికి ఈ గంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మారుతుంది. ఈ గంజి జుట్టుకి సహజమైన షైనింగ్‌ని, మృదుత్వాన్ని అందిస్తుంది. ఈ గంజినీటికి మెంతికూర, అలోవెర జోడించి, పులియబెట్టి అప్లై చేస్తే జుట్ట చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. ఇది వెంట్రుకలు నెరసిపోవడాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ జుట్టుని మృదువుగా మార్చే గుణం ఉటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఐసిస్ పాశవికం: నీళ్లలో మరగబెట్టి చంపేశారు!
వేడివేడి నీటి చుక్క ఒక్కటి ఒంటిపై పడితేనే విలవిల్లాడిపోతాం. అలంటిది బతికున్న మనుషుల్ని బాగా మరగబెట్టిన నీళ్లలో ప్రాణాలు పోయేంతవరకు ఉడకబెట్టారు. విభిన్న తరహాలో శిక్షలు అమలు చేస్తూ ఇప్పటికే పైశాచికం పీక్స్ కు వెళ్లిన ఐసిస్ అగ్రనేతలు.. ఇప్పుడు తమ మాట వినని జిహాదీలను మరిగే నీళ్లలో ముంచుతున్నారు. ఇరాక్, సిరియాల్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్.. ఆ దేశాల భద్రతా దళాలతో నిత్యం తలపడుతూనేఉంది. జులై 4న బాగ్ధాద్ కు 60 కిలోమీటర్ల దూరంలోని లాహుద్దీన్ ప్రావిన్స్ లో ఇరాకీ దళాలతో ఐసిస్ ఉగ్రవాదులు తలపడ్డారు. ఓవైపు పోరు జరుగుతుండగానే ఐసిస్ కు చెందిన ఏడుగురు జీహాదీలు యుద్ధభూమి పారిపోయారు. ఆదేశాలు పాటించకుండా పలాయనం చిత్తగించిన ఆ ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ లెవవన్ట్ (ఐఎస్ఐఎల్) మరణ శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశంలో పొయ్యిని ఏర్పాటుచేసి, దానిపైన భారీ గిన్నెలో నీళ్లు మరిగించి ఏడుగురిని అందులో ముంచి చంపారు. ఐఎస్ తన జిహాదీలను చంపుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆదేశాలు పాటించని వారిని కర్కషంగా చంపిన సందర్భాలున్నాయి. అయితే నీళ్లలో మరగబెట్టి చంపడం మాత్రం ఇదే మొదటిసారి. గత నెలలో 19 మంది జిహాదీలను తుపాకితో కాల్చిచంపిన ఐసిస్ అగ్రనేతలు.. మే నెలలో మౌసూల్ పట్టణంలో 25 మంది అనుమానిత గూఢచారులను నైట్రిక్ యాసిడ్ లో ముంచి చంపేశారు. సిరియాలో పట్టుపడ్డ ఐదుగురు జర్నలిస్టులను గత నెల(జూన్ లో) పీకలుకోసి చంపారు. బందీలుగా చిక్కిన ఇతర జాతుల మహిళలను కూడా ఐసిస్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేస్తారు. చంపడం లేదా చావడం అనే నినాదం నుంచి చంపకపోతే చంపుతాం అనే బలవంతపు యుద్ధంలోకి యువకులను దించుతున్న ఐసిస్ నిజంగా ఓ రాక్షస బృందం.