జెన్‌జీతో క‌లిసి డ్యాన్స్‌.. దుమ్మురేపిన‌ జ‌డేజా భార్య‌ | Jadeja Wife Rivaba-Jadeja-Dance-Modi Birthday-Celebrations-Jamnagar | Sakshi
Sakshi News home page

జెన్‌జీతో క‌లిసి డ్యాన్స్‌.. దుమ్మురేపిన‌ జ‌డేజా భార్య‌

Sep 21 2026 6:32 PM | Updated on Sep 21 2026 7:00 PM

Jadeja Wife Rivaba-Jadeja-Dance-Modi Birthday-Celebrations-Jamnagar

Photo Credit: Twitter

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య‌, గుజ‌రాత్ మంత్రి రివాబా జ‌డేజా జెన్‌జీతో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యంలోకి వెళితే.. ఇటీవ‌లే భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోదీ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని జామ్‌న‌గ‌ర్‌లోని డీకేవీ క‌ళాశాల‌లో 'ఆశీర్వాద్ నో దివ్‌డో' పేరుతో భ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 

ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రివాబా జ‌డేజా శ్రీకృష్ణుని భ‌క్తిలో లీన‌మ‌య్యారు. రివాబాతో క‌లిసి జెన్ జెడ్ యువ‌త కూడా కృష్ణ త‌న్మ‌య‌త్వంలో మునిగిపోయి భ‌జ‌న చేస్తూ డ్యాన్సులు చేయ‌డం ఆక‌ట్టుకుంది. ఎప్పుడూ హుందాగా న‌డుచుకునే రివాబా భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయి నృత్యం చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కార్య‌క్ర‌మంలో భాగంగా రివాబా గాయ‌కుడితో క‌లిసి వేదిక‌పైకి వ‌చ్చారు. గాయ‌కుడితో క‌లిస పాట పాడుతూ అడుగులు క‌లిపారు. ఆమె భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న ఆ కార్య‌క్ర‌మానికే హైలైట్‌గా నిలిచింది. దీంతో కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన యువ‌త కూడా రివాబాతో క‌లిసి చిందేస్తూ ఉత్సాహంగా చ‌ప్ప‌ట్లు కొడుతూ కృష్ణ త‌న్మ‌య‌త్వంలో మునిగిపోయారు. 

ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి ధన్‌సుఖ్ భండేరి, మేయర్ మోనికాబెన్ వ్యాస్, బీజేపీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక ర‌వీంద్ర జ‌డేజా ఇటీవ‌లే శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవ‌సం చేసుకుంది. సిరీస్‌లో జ‌డేజా రెండు మ్యాచ్‌లు క‌లిపి 8 వికెట్లు తీయ‌డంతో పాటు బ్యాట్‌తో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 65 ప‌రుగులు చేశాడు.

ఇదీ చదవండి: జపాన్‌తో చారిత్రక మ్యాచ్‌.. చిక్కుల్లో భార‌త క్రికెట‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement