కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు భారత విద్యార్థుల దుర్మరణం | Canada Plane Crash Two Indian Students Die During Flight Training | Sakshi
Sakshi News home page

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు భారత విద్యార్థుల దుర్మరణం

Sep 21 2026 11:11 AM | Updated on Sep 21 2026 11:30 AM

Canada Plane Crash Two Indian Students Die During Flight Training

వాంకోవర్‌: కెనడాలో వైమానిక శిక్షణ  పొందుతున్న సమయంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్థులు మరణించారు. మృతులను తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పుదుచ్చేరికి చెందిన శ్రీశరణ్ తిరుజ్ఞానసంబందంగా అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, విద్యార్థుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement