కెనడాలోని టొరంటో నగరంలో పంజాబ్‌కు చెందిన నవ్‌నీత్ కౌర్ (26) అనే భారత సంతతి మహిళ దారుణ హత్యక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు రాజ్ పాల్ (రాజత్ జస్వాల్) కోర్టుకు హాజరయ్యాడు.
పశ్చిమ లండన్‌లోని హాన్స్‌స్లో (Hounslow) ప్రాంతంలోని చెర్ట్‌సే రోడ్‌లో ఉన్న నివాసంలో నవ్‌నీత్ కౌర్‌ను హత్య చేసిన ఆరోపణలపై 31 ఏళ్ల రాజత్ జస్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హత్య కేసే కాకుండా, ప్రాణాలకు హాని కలిగించే ఉద్దేశ్యంతో తుపాకీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై హెండన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
కాగా నవంబర్ 4 మధ్యాహ్నం 'వెల్ఫేర్ చెక్' కోసం చెర్ట్‌సే రోడ్‌లోని ఇంటికి వెళ్లిన మెట్రోపాలిటన్ పోలీసులకు నవ్‌నీత్ కౌర్ తీవ్ర తుపాకీ గాయాలతో పడి ఉండటం కనిపించింది. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. నవనీత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ (డీసీఐ) సారా లీ (Sarah Lee) ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నవారు, లేదా ఆ ప్రాంతంలోని డోర్‌బెల్ కెమెరా, డాష్‌క్యామ్ ఫుటేజ్ ఉన్నవారు పోలీసులకు అందించి దర్యాప్తులో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


