సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ఫెర్టిలిటీ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆరోపించారు. అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో సుమారు 50 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించామని వెల్లడించారు. అయితే ప్రధాన నిందితుడి పేరును బయటపెట్టడం లేదని, అతడి వెనుక ఎవరున్నారో, అతడు ఎవరి మనిషో తేలాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులతో పాటు వైద్య అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని శారద విమర్శించారు.
కాగా ఈ కేసుకు సంబంధించి ఐదు ఫెర్టిలిటీ కేంద్రాల ప్రతినిధులు సోమవారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇందిరా IVF, నర్మద ఫెర్టిలిటీ, ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ART, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాల ప్రతినిధులను మహిళా కమిషన్ విచారించింది.
అక్రమ అండాల సేకరణ ఆరోపణల నేపథ్యంలో ఈ ఐదు కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశామని నేరెళ్ల శారద తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు


