హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాటేదాన్‌లోని ఓ పరిశ్రమలో మంటలు చెలరెగాయి. క్షణాల్లోనే పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించాయి. ప్లై వుడ్ కావడంతో క్షణాల్లో అంటుకున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు తోడు నల్లటిపొగ దట్టంగా వ్యాపించింది. స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్ధానికులు. ఇండ్లలో నుండి బయటికి పరుగులు తీశారు. హుటాహుటిన ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్ధానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టాయి. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అక్కడి పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.


