సాక్షి: హైదరాబాద్: హిమాయత్‌సాగర్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ను ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కొత్తూరు సమీపంలో ఓ కార్యక్రమంలో పనిచేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది ఉన్నట్లుగా సమాచారం. అయితే, ఆటో వేగంగా వచ్చి టిప్పర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


