ఆరుగుర్ని పొట్టన పెట్టుకున్న ఉన్మాది మృతి | Krakow mass shooting Gunman who killed 6 in died in hospital | Sakshi
Sakshi News home page

Krakow Shooting ఆరుగుర్ని పొట్టన పెట్టుకున్న ఉన్మాది మృతి

Nov 9 2026 2:30 PM | Updated on Nov 9 2026 2:45 PM

Krakow mass shooting Gunman who killed 6 in died in hospital

Krakow Shooting పోలాండ్‌లోని చారిత్రాత్మక క్రకోవ్ (Kraków) నరంలో దారుణానికి ఒడిగట్టిన ఉన్మాది చనిపోయాడు. ఆరుగురిని కాల్చిచంపిన దుండగుడు  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సోమవారం పోలీసులు తెలిపారని రాయటర్స్   వెల్లడిండించింది. ఈ దాడి సమయంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించి అనేక శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, పరిస్థితి విషమించి మరణించాడని అధికారులు వెల్లడించారు. కఠినమైన తుపాకీ చట్టాలు ఉన్న పోలాండ్‌లో ఇంత దారుణ  మాస్ షూటింగ్ జరగడంతో యావద్దేశం  ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అధికారులు  నగరంలో భద్రతను మరింత పెంచారు.

20 ఏళ్ల వయస్సున్న పోలిష్ పౌరుడైన నిందితుడు శనివారం మధ్యాహ్నం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే క్రకోవ్ నగర ప్రధాన మార్కెట్ స్క్వేర్‌లోకి కార్‌లో వచ్చాడు. కారులో నుంచే జనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను పొట్టనబెట్టుకున్నాడు. మరో 16 మంది (ఇద్దరు పోలీసులతో సహా) గాయపడ్డారు.  బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, పోర్చుగ‌ల్‌, ర‌ష్యాకు చెందిన దేశీయులుగా  గుర్తించారు. మరోవైపు  నిందితుడి స్వస్థలమైన ఆస్ట్రోవియెక్ స్వీతోక్రజిస్కీ గ్రామంలోని అతడి ఇంటి వద్ద తల్లి, తండ్రి ,సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. ఈ హత్యలను కూడా నిందితుడే చేసి ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

అతడి కారులో మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి. ఈ దాడి వెనుక రాడికల్‌ భావజాల కోణంతోపాటు,  ఉగ్రవాద దాడి కోణంలో కూడా విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: బాలికపై హత్యాచారం : నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement