విభజన తర్వాత.. 78 ఏళ్లకు తెరుచుకున్న పాక్‌ గురుద్వారా! | Historic Gurdwara In Pakistan Lahore Reopens For Sikh Worship After 79 Years Since Partition, Read Story For Interesting Facts | Sakshi
Sakshi News home page

విభజన తర్వాత.. 78 ఏళ్లకు తెరుచుకున్న పాక్‌ గురుద్వారా!

Nov 9 2026 1:27 PM | Updated on Nov 9 2026 1:40 PM

Gurdwara in Lahore of Pakistan reopens for worship after 79 years

లాహోర్‌: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న చారిత్రక గురుద్వారా ‘చ్ఛేవిన్ పాత్‌షాహీ శ్రీ గురు హరగోవింద్ సాహిబ్’ 79 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. 1947లో భారత్-పాకిస్థాన్ విభజన తర్వాత మూతపడిన ఈ ప్రార్థనా మందిరం పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ఆదివారం నుంచి సిక్కుల ప్రార్థనలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మైనారిటీల శాఖ మంత్రి, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు రమేశ్ అరోరా, ఈటీపీబీ కార్యదర్శి నాసిర్ ముష్తాక్ తదితర అధికారులు హాజరయ్యారు. గురుద్వారా పునరుద్ధరణ పూర్తయిందని, సిక్కు సమాజం ఇకపై ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చని రమేశ్ అరోరా తెలిపారు. సిక్కుల మత వారసత్వాన్ని కాపాడేందుకు పాకిస్థాన్‌లో మరో 50కి పైగా గురుద్వారాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఈ గురుద్వారా ఆరో సిక్కు గురువు గురు హరగోవింద్ సాహిబ్‌తో పాటు భాయ్ బిధి చంద్‌తో సంబంధం కలిగిన చారిత్రక కట్టడం. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో దీని అసలు నిర్మాణం జరిగినట్లు భావిస్తున్నారు. 1947 విభజన సమయంలో గురుద్వారాను రక్షించే ప్రయత్నంలో పలువురు సిక్కులు ప్రాణాలు కోల్పోయినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత ఈ ప్రార్థనా మందిరం తిరిగి తెరుచుకోవడంపై సిక్కు సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది.

ఇదీ చదవండి: 13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement