పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియా బ్యాటింగ్‌ | ACC Mens U19 Asia Cup 2026 IND VS PAK: India won the toss and elected to Bat | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియా బ్యాటింగ్‌

Nov 8 2026 10:16 AM | Updated on Nov 8 2026 10:25 AM

ACC Mens U19 Asia Cup 2026 IND VS PAK: India won the toss and elected to Bat

source: X

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌ 2026లో భాగంగా ఇవాళ బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌ అల్‌ అమీరట్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ గ్రూప్‌-ఏలో పోటీపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన తలో మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్‌ టాపర్లుగా కొనసాగుతున్నాయి. భారత్‌ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మొదటి స్థానంలో ఉండగా.. పాక్‌ తమ తొలి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో స్థానంలో కొనసాగుతోంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డు: భారత్‌-పాక్‌ ఇప్పటివరకు 30 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ 17, పాకిస్తాన్‌ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే, 2021 నుంచి జరిగిన 6 మ్యాచ్‌లలో భారత్ కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది.

తుది జట్లు..
పాకిస్తాన్‌: ఉస్మాన్ ఖాన్, జహంగీర్ బిలాల్, అబ్దుల్ ఖాదిర్, అహ్మద్ హుస్సేన్, అలీ రజా, హమ్జా జహూర్(w), హస్నైన్ అబ్బాస్ దార్, మహ్మద్ సయ్యామ్, ఫర్హాన్ యూసఫ్(c), నికాబ్ షఫీక్, రిజ్వానుల్లా

భారత్‌: లక్ష్య రాజేష్ రాయచందానీ(సి), ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్(w), అర్జున్ రాజ్‌పుత్, ఇషాన్ సూద్, కావ్య పటేల్, మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, యశ్వీర్ గౌడ్, వీకే వినీత్, యశ్‌బర్ధన్ చౌహాన్

ఇదీ చదవండి: షమీకి టీమిండియా కోచింగ్ బాధ్యతలు..?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement