source: X
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో అతడు 7 పరుగులకే ఔటైనప్పటికీ.. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు.
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లి- 1976
రికీ పాంటింగ్- 1971
సచిన్ టెండూల్కర్- 1750
కుమార సంగక్కర- 1568
సనత్ జయసూర్య- 1519
జాక్ కల్లిస్- 1449
మ్యాచ్ విషయానికొస్తే.. వెల్లింగ్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ న్యూజిలాండ్‌ను 134 పరుగులకే (41 ఓవర్లు) కుప్పకూల్చింది. గుర్నూర్ బ్రార్ 4,అక్షర్ పటేల్, అన్షుల్ కంబోజ్, ఆకిబ్ నబీ తలో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బ కొట్టారు. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (55) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా తడబడుతోంది. 17 పరుగులకే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి 7 పరుగులకే నిష్క్రమించాడు. 2 వికెట్లు జేకబ్ డఫీకే దక్కాయి. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20-2గా ఉంది. రోహిత్ శర్మ 10, శ్రేయస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్


