IND vs NZ: ‘వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతడికి చోటు ఖాయం’ | He is putting his hand up: Ex IND Star on Indian pacer WC 2027 chances | Sakshi
Sakshi News home page

IND vs NZ: ‘అదరగొడుతున్నాడు.. వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతడికి చోటు ఖాయం’

Nov 7 2026 12:05 PM | Updated on Nov 7 2026 12:30 PM

He is putting his hand up: Ex IND Star on Indian pacer WC 2027 chances

సహచర ఆటగాళ్లతో అన్షుల్‌ కాంబోజ్‌ (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌.. రెండో వన్డేలోనూ రాణించాడు. ఆక్లాండ్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. కేవలం 22 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

మరోసారి అద్భుత ప్రదర్శన
తద్వారా తొలి వన్డేలో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు పాతికేళ్ల అన్షుల్‌. తాజాగా శనివారం నాటి రెండో వన్డేలోనూ ఈ హర్యానా బౌలర్‌ మరోసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వెల్లింగ్‌టన్‌లో 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అన్షుల్‌ కేవలం 25 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు కూల్చాడు.

కివీస్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ (11) రూపంలో కీలక వికెట్‌ తీసిన అన్షుల్‌.. ఆఖర్లో బ్లెయిర్‌ టిక్నర్‌ (2)ను బౌల్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌.. అన్షుల్‌ కాంబోజ్‌పై ప్రశంసలు కురిపించాడు. కివీస్‌ పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తున్న ఈ రైటార్మ్‌ పేసర్‌.. కచ్చితంగా వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టులో చోటు సంపాదించగలడని అంచనా వేశాడు.

వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయమే!
ఈ మేరకు.. ‘‘మెరుగైన పిచ్‌లపై.. కాంబోజ్‌ తన విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌ టోర్నీ కోసం టీమిండియాలో చోటు ఖాయం చేసుకునేందుకు అతడు ముందు వరుసలోకి దూసుకువస్తున్నాడు’’ అని అశ్విన్‌ మ్యాచ్‌ మధ్యలోనే ట్వీట్‌ చేశాడు. 

కాగా వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి సౌతాఫ్రికా వేదిక. అక్కడి పిచ్‌లు కూడా కివీస్‌ పిచ్‌ల మాదిరే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అశూ ఈ మేరకు అన్షుల్‌ బౌలింగ్‌ను కొనియాడటం విశేషం.

చెలరేగిన భారత బౌలర్లు.. కివీస్‌ 134 పరుగులకే ఆలౌట్‌
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. వర్షం వల్ల టాస్‌ ఆలస్యం కాగా న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య రెండో వన్డేను 47 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. కివీస్‌ బ్యాటింగ్‌కు దిగింది.

అయితే, భారత బౌలర్ల విజృంభణకు తాళలేక కేవలం 41 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. డారిల్‌ మిచెల్‌ అర్ధ శతకం (55) సాధించగా.. కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (31) ఓ మోస్తరుగా రాణించాడు. టీమిండియా బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అక్షర్‌ పటేల్‌, ఆకిబ్‌ నబీ, అన్షుల్‌ కాంబోజ్‌ తలా రెండు వికెట్లు కూల్చారు.​

ఇవీ చదవండి: IND vs NZ: శతక్కొట్టిన జైస్వాల్‌.. అదరగొట్టిన సాయి.. భారత్‌ భారీ స్కోరు!
కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement