‘అతడిని డ్రెసింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడతా.. ఇంటికి కూడా వెళ్లనివ్వను’ | Ex IND Cricketer Special Plan For Virat Kohli If He Plays Vijay Hazare Trophy, Says I Will Make Him Sit Dressing Room Wont Let Go Home | Sakshi
Sakshi News home page

‘అతడిని డ్రెసింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడతా.. ఇంటికి కూడా వెళ్లనివ్వను’

Nov 6 2026 12:22 PM | Updated on Nov 6 2026 1:09 PM

I Will make him sit dressing room wont let go home: Ex IND cricketer on Kohli

విరాట్‌ కోహ్లి (Photo Credit: BCCI X)

టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఢిల్లీ నుంచి మొదలైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ప్రయాణం.. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘కింగ్‌’ స్థాయికి చేరింది. మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం రారాజుగా.. ముఖ్యంగా ఛేజింగ్‌ కింగ్‌గా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.

ఏకైక క్రికెటర్‌గా
ఇప్పటికే వన్డేల్లో 55 శతకాలు బాది.. అంతర్జాతీయ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ రన్‌మెషీన్‌ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో కోహ్లి బిజీగా ఉన్నాడు.

దేశీ క్రికెట్‌ బరిలో దిగితే
ఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్‌, ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్‌ విజయ్‌ దహియా.. వన్డే ప్రపంచకప్‌-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కోహ్లిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిసెంబరులో దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2026-27 సీజన్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.  

అతడిని డ్రెసింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడతా.. 
ఒకవేళ నిజంగానే కోహ్లి గనుక మరోసారి దేశీ క్రికెట్‌ బరిలో దిగితే.. తాను అతడిని గంటల కొద్దీ డ్రెసింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడతానని విజయ్‌ దహియా అన్నాడు. యువ ఆటగాళ్లకు కోహ్లి ఇచ్చే ఒక్క ప్రసంగం చాలునని.. అందుకే అతడు మైదానంలో దిగకపోయినా డ్రెసింగ్‌రూమ్‌లో ఉన్నా చాలని పేర్కొన్నాడు.

ఇంటికి కూడా వెళ్లనివ్వను
రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో భాగంగా పాలెం వేదికగా సర్వీసెస్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ గురువారం డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ కోహ్లి గనుక విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు వస్తే.. డ్రెసింగ్‌రూమ్‌లో అతడిని చూడటం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.

ఊరికే అలా కూర్చుని యువ ఆటగాళ్లతో కోహ్లి మాట్లాడితే చాలు. నేనైతే కోహ్లిని ఇంటికి కూడా వెళ్లనివ్వకుండా అక్కడే ఉండమని చెప్తాను (సరదాగా). డ్రెసింగ్‌రూమ్‌లో కోహ్లిని కూర్చోబెట్టి.. తన ప్రయాణం, కఠిన శ్రమ, తను పాటించే విలువలు.. దేశానికి ఆడటంలో ఉండే గర్వం.. ఇలా అన్నింటి గురించి మా ఆటగాళ్లతో మాట్లాడమని చెప్తాను.

 ప్రతీ దశను నేను చూశాను
కోహ్లి కెరీర్‌లోని ప్రతీ దశను నేను చూశాను. ఎక్కడి నుంచి మొదలై.. ఎక్కడిదాకా చేరాడో నాకూ తెలుసు. అయితే, ప్రతీ ఆటగాడు విరాట్‌ కాలేకపోవచ్చు. అయితే, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు విరాట్‌ కచ్చితంగా స్ఫూర్తిదాయకం అవుతాడు’’ అని విజయ్‌ దహియా చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి గతేడాది ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ బరిలో దిగిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి: ‘ఇంకెన్నాళ్లు బెంచ్‌ మీదే ఉంటాడు.. టీమిండియాకు మంచిది కాదు’
#HBD Kohli: 10 రోజుల ప‌నిలో 626 ప‌రుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement