విరాట్ కోహ్లి (Photo Credit: BCCI X)
వన్డే రారాజుగా పేరొందాడు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికే 15 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో అత్యధికంగా 55 శతకాలు బాదిన వీరుడిగా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఛేజింగ్ కింగ్
వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన కోహ్లి.. బుధవారం న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. ఆక్లాండ్ వేదికగా 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 51 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక కోహ్లి గురువారం (నవంబరు 5) 38వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ‘కింగ్’కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ.. భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో కోహ్లి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
టాప్-5 వన్డే క్రికెటర్లు వీరే
ఇందులో బద్రీనాథ్ తన టాప్-5 వన్డే క్రికెటర్లను ఎంచుకున్నాడు. అయితే, ప్రపంచంలోనే వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడైన కోహ్లికి మాత్రం చోటు ఇవ్వలేదు. తన జాబితాలో అగ్రస్థానాన్ని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు కట్టబెట్టిన బద్రీనాథ్... ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా స్టార్లు రిక్కీ పాంటింగ్, మైకేల్ బేవాన్, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రంలకు చోటిచ్చాడు.
ఆ నాలుగు సరైన ఎంపికలే!
కాగా టెండుల్కర్‌కు నంబర్ వన్ స్థానం ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. 463 వన్డేల్లో అత్యధికంగా 18426 పరుగులు సాధించి.. ప్రపంచంలోనే టాప్ రన్ స్కోరర్‌గా సచిన్ కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 49 వన్డే శతకాలు కూడా ఉన్నాయి.
ఇక పాంటింగ్ 375 వన్డేల్లో 30 సెంచరీల సాయంతో 13,704 పరుగులు సాధించాడు. మరోవైపు.. బేవాన్ మాత్రం 232 వన్డేల్లో 6912 పరుగులు చేయగలిగాడు. అతడి ఖాతాలో కేవలం ఆరు శతకాలు మాత్రమే ఉన్నాయి. ఇక సంగక్కర 25 శతకాల సాయంతో 404 వన్డేల్లో 14,234 పరుగులు సాధించాడు.
తిరుగులేని కోహ్లి
ఇదిలా ఉంటే వసీం అక్రం.. 356 వన్డేలు ఆడి 502 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఇక కోహ్లి ఇప్పటికి కేవలం 318 వన్డేల్లోనే 55 సెంచరీలు, 80 అర్ధ శతకాలు బాది ఏకంగా 15,813 పరుగులతో కొనసాగుతున్నాడు.
ఇవీ చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
‘ఇంకెన్నాళ్లు బెంచ్ మీదే ఉంటాడు.. టీమిండియాకు మంచిది కాదు’


