విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు | Virat Kohli Breaks Sachin Tendulkar's WORLD RECORD For Most Runs In ODI Chases | Sakshi
Sakshi News home page

IND vs NZ: విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు

Nov 4 2026 3:02 PM | Updated on Nov 4 2026 3:13 PM

Virat Kohli Breaks Sachin Tendulkar's WORLD RECORD For Most Runs In ODI Chases

టీమిండియా రన్‌మిషన్ విరాట్ కోహ్లి తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో లక్ష్య చేధనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. 

54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. విరాట్ ఇప్పటివరకు రన్ చేజ్‌ల్లో  169 ఇన్నింగ్స్‌లు ఆడి 8,727* ప‌రుగులు చేశాడు. స‌చిన్ త‌న వ‌న్డే కెరీర్‌లో ల‌క్ష్య చేధ‌న్లో 232 ఇన్నింగ్స్‌లు ఆడి 8,720 ప‌రుగులు చేశాడు. తాజా నాక్‌తో సచిన్‌నుఅధిగమించి వన్డే చేజింగ్‌లలో అత్యధిక పరుగులు చేసిన నంబర్-1 బ్యాటర్‌గా విరాట్‌ నిలిచాడు.

వన్డే చేజింగ్‌లలో అత్యధిక పరుగులు చేసిన టాప్-3 బ్యాటర్లు:
1    విరాట్ కోహ్లి( భారత్) -169 మ్యాచ్‌లు- 8,727*
2    సచిన్ టెండూల్కర్( భారత్)- 232 మ్యాచ్‌లు- 8,720
3    రోహిత్ శర్మ  (భారత్) -163 మ్యాచ్‌లు - 6,801

అదేవిధంగా న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా బాబర్‌ ఆజం, రికీ పాంటింగ్‌ రికార్డును విరాట్‌ సమం చేశాడు. వీరుముగ్గురూ తలా 27 సార్లు ఏభైకి పైగా పరుగులు పడగొట్టారు. మరో హాఫ్‌ సెంచరీ సాధిస్తే బాబర్‌, పాంటింగ్‌ను కోహ్లి దాటేస్తాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement