వ‌ర్షం అంత‌రాయం.. టీమిండియా రివైజ్డ్ టార్గెట్‌ ఇదే | Rain Interrupted-1st ODI-IND-Revised Targets Announced-Detalis-Vs NZ | Sakshi
Sakshi News home page

వ‌ర్షం అంత‌రాయం.. టీమిండియా రివైజ్డ్ టార్గెట్‌ ఇదే

Nov 4 2026 1:33 PM | Updated on Nov 4 2026 1:47 PM

Rain Interrupted-1st ODI-IND-Revised Targets Announced-Detalis-Vs NZ

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌, టీమిండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి వ‌న్డేకు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు వ‌ర్షం ఒక‌సారి ఇబ్బంది పెట్టింది. ఇక టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభ‌మైన 10.5 ఓవ‌ర్ల త‌ర్వాత భారీ వ‌ర్షం ప‌డింది. 

వ‌ర్షంతో మ్యాచ్ నిలిచిపోయే స‌మయానికి భార‌త్ 10.5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 54 ప‌రుగులు చేసింది. కోహ్లి (28), గిల్ (17) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భార‌త్ విజ‌యానికి 39.1 ఓవ‌ర్ల‌లో 132 ప‌రుగులు అవ‌స‌రం. ఈడెన్ పార్క్‌లో రెండోసారి వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో 10 ఓవర్ల కటాఫ్‌ అనంతరం భారత్‌ ముంగిట 40 ఓవర్లలో 167 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించడం జరిగింది. దీంతో భారత్‌ 11.1 ఓవర్లలో 113 పరుగులు చేయాల్సి ఉంటుంది.

👉ఒకవేళ మరోసారి వర్షం వస్తే మాత్రం సవరించిన టార్గెట్‌లు ఈ విధంగా ఉండనున్నాయి.
20 ఓవర్ల కటాఫ్‌ అనంతరం: భారత్‌ విజయలక్ష్యం 30 ఓవర్లలో 137 పరుగులు
30 ఓవర్ల కటాప్‌ అనంతరం:  భారత్‌ విజయలక్ష్యం 20 ఓవర్లలో 92 పరుగులు

👉ఎలా చూసుకున్నా భార‌త్‌కే విజ‌యావకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కోహ్లి, గిల్ క్రీజులో ఉండడం, ఆ త‌ర్వాత అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్ , అక్ష‌ర్‌, న‌మ‌న్ ధీర్‌ల‌తో బ్యాటింగ్ ఆర్డ‌ర్ ప‌టిష్టంగా క‌నిపిస్తుంది. దీంతో వ‌ర్షం తెరిపినిస్తే భార‌త్ విజ‌యం లాంఛ‌న‌మే అవనుంది.

అంతకముందు టీమిండియా బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆఖర్లో టిక్నర్ (24 బంతుల్లో 34) మెరవగా,  గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇదీ చదవండి: టీమిండియా ప్లేయ‌ర్ అరుదైన రికార్డు.. ప‌దేళ్ల త‌ర్వాత‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement