Photo Credit: Twitter
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో సరదాగా ఉండే కోహ్లి తన సహచర ఆటగాళ్లను ఆటపట్టించడం చూస్తుంటాం. అయితే కోహ్లి కేవలం తన జట్టు ఆటగాళ్లతోనే కాదు, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను కూడా ఆటపట్టించడం చాలా సందర్భాల్లో గమనించాము. తాజాగా న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను కోహ్లి ఆట పట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. కివీస్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ ముగిసిన తర్వాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మాట్లాడుకుంటున్నారు. అంతకముందే గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో ఫిలిప్స్‌కు జాగ్రత్తగా ఆడుదామని మిచెల్ పేర్కొన్నాడు. ఇటీవలే టీ20 సిరీస్‌లో మంచి ఫామ్ కనబరిచిన గ్లెన్ ఫిలిప్స్‌ను గమనించిన కోహ్లి, అతడిని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు.
మిచెల్‌తో మాటా మంతి ముగించుకొని క్రీజువైపు వస్తున్న ఫిలిప్స్‌కు ఎదురుగా వచ్చిన కోహ్లి.. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్‌సెనా పాపులర్ సిగ్నేచర్ "యూ కాంట్ సీ మీ (You Can’t See Me)" అంటూ పేర్కొన్నాడు. ఇది చూసిన ఫిలిప్స్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది. ఆ తర్వాత కాసేపటికే డారిల్ మిచెల్ ఔటవ్వగా, ఫిలిప్స్ 51 బంతులాడి 30 పరుగులు చేసి ఔటయ్యాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆఖర్లో టింక్నర్ (24 బంతుల్లో 34) మెరవగా, గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
G.O.A.T doing G.O.A.T-ed signature moves! 🐐 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/4GRzemYxun
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
ఇదీ చదవండి:


