ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 9 పరుగులు చేసిన విల్ యంగ్‌ను అర్షదీప్ ఔట్ చేయడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే నికోల్స్ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో సీఫెర్ట్, డారిల్ మిచెల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
73 పరుగుల వద్ద సీఫెర్ట్ ఔట్ కాగా, ఆ తర్వాత మిచెల్ రోహిత్ అద్భుత ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. దీంతో 115 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నాడు. చివర్లో జాకబ్ డఫీ మూడు ఫోర్లు బాదడంతో కివిస్ 150 పరుగుల మార్క్‌ను దాటింది. ఆఖర్లో బ్లెయిర్ టింక్నర్ (23 బంతుల్లో 34; ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరవడంతో న్యూజిలాండ్ 180 పరుగుల మార్క్‌ను దాటింది.


