టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వయస్సు, ఫిట్‌నెస్‌పై తరచూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడేందుకు అతడు అర్హుడు కాదంటూ కొందరు చర్చిస్తున్నారు. అయితే ఈ విమర్శలన్నింటికీ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్‌తో మైదానంలోనే గట్టి సమాధానమిచ్చాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సంచలన రనౌట్‌తో హిట్‌మ్యాన్ మెరిశాడు.
అసలేం జరిగింది?
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ తొలి బంతిని గ్లెన్ ఫిలిప్స్‌కు లెగ్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని ఫిలిప్స్ లెగ్‌సైడ్ వైపు ఆడి క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్-వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ మెరుపు వేగంతో స్పందించాడు.
క్షణాల వ్యవధిలో బంతిని అందుకున్న రోహిత్.. గాల్లోకి డైవ్ చేస్తూ స్ట్రైకర్ ఎండ్ వైపు అండర్ ఆర్మ్ త్రో విసిరాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బంతిని అందుకుని వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. క్రీజులోకి చేరుకునేందుకు డారిల్ మిచెల్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, రోహిత్ మెరుపు త్రో కారణంగా రనౌట్ అవ్వక తప్పలేదు.
మిచెల్ కెరీర్‌లో తొలిసారి..
భారత జట్టుపై అద్భుతమైన రికార్డు ఉన్న ప్రమాదకరమైన డారిల్ మిచెల్ తక్కువ పరుగులకే ఇలా రనౌట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. కాగా, డారిల్ మిచెల్ తన వన్డే కెరీర్‌లో రనౌట్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
<blockquote class="twitter-tweet"><p lang="et" dir="ltr">Rohit Sharma 😍 #NZvsIND https://t.co/8CnBTvWdoh</p>— CREX (@Crex_live) <a href="https://x.com/Crex_live/status/2117835543828734233?ref_src=twsrc%5Etfw">November 4, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>


