విరాట్ కోహ్లి క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మైండ్ బ్లాంక్‌! | Virat Kohli takes stunning catch to dismiss dangerous Nathan smith | Sakshi
Sakshi News home page

IND vs NZ: విరాట్ కోహ్లి క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మైండ్ బ్లాంక్‌!

Nov 4 2026 10:30 AM | Updated on Nov 4 2026 10:35 AM

Virat Kohli takes stunning catch to dismiss dangerous Nathan smith

అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో కివీస్ ప్లేయర్ నాథన్ స్మిత్‌ను విరాట్‌ పెవిలియన్‌కు పంపాడు.  స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను సెకండ్ స్లిప్‌లో కోహ్లి నమ్మశక్యం కాని రీతిలో అందుకని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అసలేమి జరిగిందంటే?
ఈ మ్యాచ్ 29వ ఓవ‌ర్ వేసిన అన్షుల్ కాంబోజ్.. తొలి బంతిని స్మిత్‌కు 135 కిలోమీటర్ల వేగంతో ఆఫ్‌స్టంప్‌కు కాస్త వెలుపలగా ఫుల్లర్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్‌సైడ్ డ్రైవ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ షాట్ స‌రిగ్గా కన‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో సెకండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ తన కుడివైపునకు గాల్లోకి డైవ్ చేస్తూ, ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు.

అత‌డి మోచేయి నేల‌ను తాకిన‌ప్ప‌టికి కోహ్లి మాత్రం బంతిని మాత్రం విడిచిపెట్ట‌లేదు. అయితే క్యాచ్ క్లీన్‌గా ఉందో లేదో సరిచూసుకోవడానికి అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రీఫ‌ర్ చేశాడు. రీప్లేలో కోహ్లి చేతి వేళ్ళు క్లియ‌ర్‌గా బంతి కింద ఉన్నట్లు తేలడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో స్మిత్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి నిరాశ‌తో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.
చదవండి: 'టెంపుల్‌'తో గిల్‌.. కోహ్లి చూస్తూ ఊరుకుంటాడా?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement