టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా | New Zealand Vs India-1st ODI-Updates-Highlights-From-Auckland | Sakshi
Sakshi News home page

IND Vs NZ: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా

Nov 4 2026 7:04 AM | Updated on Nov 4 2026 7:34 AM

New Zealand Vs India-1st ODI-Updates-Highlights-From-Auckland

Photo Credit: BCCI Twitter

NZ Vs IND 1st ODI Updates:

ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌, టీమిండియాల మ‌ధ్య తొలి వ‌న్డే ప్రారంభ‌మ‌యింది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. 

నితీశ్‌రెడ్డికి దక్కని చోటు..
భారత జట్టు ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డికి చోటు దక్కుతుందని భావించినప్పటికీ, అతడికి నిరాశే ఎదురైంది. అర్షదీప్‌, అకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, అన్షుల్‌ కాంబోజ్‌లు పేస్‌ బాధ్యతలు తీసుకోనుండగా, స్పిన్నర్లుగా అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌ ఉన్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టులో కాన్వే అందుబాటులో లేకపోవడంతో టిమ్‌ సీఫెర్ట్‌ జట్టులోకి వచ్చినట్లు మిచెల్‌ సాంట్నర్‌ తెలిపాడు. 

టీమిండియా తుదిజట్టు: 
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్ తుదిజట్టు: 
టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామిసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్

వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం
అంతకముందు వర్షం కారణంగా టాస్‌ కాస్త ఆలస్యమైంది. టీ20 సిరీస్‌ను 3-2తో నెగ్గిన భారత్‌ వన్డే సిరీస్‌లోనూ జోరు చూపాలని భావిస్తోంది.

జ‌ట్టు కూర్పు..
టీ20 సిరీస్‌లో ఆడిన కనీసం ఐదుగురు ఆటగాళ్లకు వన్డేల్లో కూడా తుది జట్టులో ఖాయం. శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు నమన్‌ ధీర్, అక్షర్‌ పటేల్, అర్‌‡్షదీప్, నితీశ్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. అయ్యర్‌కు నాలుగో స్థానంలో ఇది సరైన ఫార్మాట్‌ కాగా, నమన్‌ ఇటీవలి ప్రదర్శనతో తన విలువను చూపించాడు. నాలుగేళ్ల కెరీర్‌లో 18 వన్డేలే ఆడిన అర్ష్ దీప్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇది సరైన అవకాశం.

క‌ళ్లన్నీ రోహిత్‌, కోహ్లిపైనే..
బ్యాటింగ్‌లో సహజంగానే ప్రధాన ఆకర్షణ కోహ్లి, రోహిత్‌లే. వీరిద్దరు తమ రెగ్యులర్‌ స్థానాల్లో సత్తా చాటితే జట్టుకు తిరుగుండదు. కివీస్‌ గడ్డపై 14 వన్డేలు ఆడినా ఒక్క సెంచరీ కూడా లేని రోహిత్‌ తన చివరి పర్యటనలో ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తున్నాడు. కెప్టెన్‌ గిల్‌ ఈ ఏడాది ఏకంగా 895 పరుగులు చేసి వన్డేల్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 

మిడిలార్డర్‌లో రాహుల్‌ బాధ్యత తీసుకుంటాడు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు విశ్రాంతి కొనసాగించడంతో పేస్‌ భారం సీనియర్‌ అయిన సిరాజ్‌పైనే ఉంది. మూడో పేసర్‌ గుర్నూర్‌ 9 వన్డేలే ఆడగా, కంబోజ్, నబీలకు ఒక్కో మ్యాచ్‌ అనుభవమే ఉంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement