రోహిత్‌- కోహ్లి కాదు! అతడినే ఎంచుకుంటా: సాంట్నర్‌ | They are still playing very well: Santner wary of Rohit Sharma Virat Kohli | Sakshi
Sakshi News home page

రోహిత్‌- కోహ్లి కాదు! అతడినే ఎంచుకుంటా: సాంట్నర్‌

Nov 3 2026 9:21 PM | Updated on Nov 3 2026 9:23 PM

They are still playing very well: Santner wary of Rohit Sharma Virat Kohli

రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి (PC: BCCI X)

టీమిండియాతో తొలి వన్డే నేపథ్యంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..

పిచ్‌ స్వభావాన్ని బట్టే
‘‘వాళ్లిద్దరు ఇప్పటికీ ఎంతో గొప్పగా ఆడుతున్నారు. ఇటీవల ఇండియాలో వెస్టిండీస్‌తో వాళ్లు ఆడిన తీరు చూశాను. సుదీర్ఘకాలంగా వాళ్లు అత్యుత్తమంగా బ్యాటింగ్‌ చేయడాన్ని నేనూ చూస్తున్నా. 

ఇక రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్న తీరును సహచర ఆటగాడిగా దగ్గరగా చూశాను. అయితే, పిచ్‌ స్వభావాన్ని బట్టే మా బౌలర్లను ఎంపిక చేసుకుంటాము. కాబట్టి రో-కోల కోసం ప్రత్యేకంగా ఇప్పుడే ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేము.

రోహిత్‌- కోహ్లి కోసం కచ్చితంగా అభిమానులు వస్తారు
ఏదేమైనా విరాట్‌- రోహిత్‌ మ్యాచ్‌ ఆడుతున్నారంటే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి వస్తారు. ఇటీవల టీ20 సిరీస్‌ సందర్భంగానూ మా స్టేడియాలు నిండిపోయాయి. ఇక వన్డే సిరీస్‌ మరింత కళగా ఉండబోతోంది. రోహిత్‌- కోహ్లి కోసం కచ్చితంగా అభిమానులు వస్తారు.

గతంలో న్యూజిలాండ్‌లో రో-కో ఆట తీరు గురించి మాకు అవగాహన ఉంది. టాపార్డర్‌లో రోహిత్‌- శుబ్‌మన్‌ గిల్‌, కోహ్లి ఉండటం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశం. రో-కో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేకపోయినా.. గిల్‌ గత ఐదేళ్లుగా అత్యద్భుతంగా ఆడుతున్నాడు.

మీరన్నట్లు ఒకవేళ టీమిండియా టాపార్డర్‌లోని ఒక వ్యక్తి మా జట్టులో ఆడే అవకాశం ఉంటే.. నేనైతే కచ్చితంగా గిల్‌నే ఎంచుకుంటాను’’ అని మిచెల్‌ సాంట్నర్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఆక్లాండ్‌ వేదికగా భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య బుధవారం (నవంబరు 4) నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది. కాగా కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-2తో గెలుచుకుంది.

ఇదీ చదవండి: IND vs NZ: షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ టైమింగ్స్‌, లైవ్‌స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement