Asia Cup: పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్‌ ఆరోజే! | Asia Cup Rising Stars: Pakistan Squad Announced Abdul Samad To Lead | Sakshi
Sakshi News home page

Asia Cup: పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్‌ ఆరోజే!

Nov 3 2026 7:15 PM | Updated on Nov 3 2026 7:43 PM

Asia Cup Rising Stars: Pakistan Squad Announced Abdul Samad To Lead

PC: PCB/X

ఏసీసీ మెన్స్‌​ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నమెంట్‌-2026కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఖతార్‌ వేదికగా వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. తమ జట్టుకు అబ్దుల్‌ సమద్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది.

15 మంది సభ్యులతో కూడిన జట్టు
ఈ జట్టులో మాజ్‌ సదాకత్‌, హసన్‌ నవాజ్‌, హైదర్‌ అలీ, షాజైబ్‌ ఖాన్‌, ఫర్హాన్‌ యూసఫ్‌, షామిల్‌ హుసేన్‌ తదితర బ్యాటర్లకు చోటు దక్కింది. బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ హస్నైన్‌, అహ్మద్‌ దనియాల్‌, ఆకిఫ్‌ జావేద్‌, సూఫియాన్‌ ముకీం తదితరులు స్థానం సంపాదించారు.

కాగా 2019లో వన్డేల్లో అరంగేట్రం చేసిన హస్నైన్‌.. గతేడాది ఫిబ్రవరిలో చివరగా మ్యాచ్‌ ఆడాడు. ఇదిలా ఉంటే.. నవంబరు 19- 29 మధ్య జరిగే ఏసీసీ మెన్స్‌​ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి.

గ్రూప్‌-‘ఎ’ నుంచి అఫ్గానిస్తాన్‌- ‘ఎ’, బంగ్లాదేశ్‌- ‘ఎ’, హాంకాంగ్‌, శ్రీలంక- ‘ఎ’ జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్‌- ‘బి’ నుంచి భారత్‌- ‘ఎ’, నేపాల్‌, పాకిస్తాన్‌- ‘ఎ’, యూఏఈ తలపడతాయి. కాగా నవంబర్ 22న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకుంటుంది. 

ఏసీసీ మెన్స్‌​ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి పాకిస్తాన్‌ జట్టు
అబ్దుల్‌ సమద్‌ (కెప్టెన్‌), అహ్మద్‌ దనియాల్‌, ఆకిఫ్‌ జావేద్‌, డానిష్‌ అజీజ్‌, ఫర్హాన్‌ యూసఫ్‌, హైదర్‌ అలీ, హసన్‌ నవాజ్‌, మాజ్‌ సదాకత్‌, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద​ ఇమ్రాన్‌, రోహైల్‌ నజీర్‌ (వికెట్‌ కీపర్‌), సాద్‌ మసూద్‌, షాజైబ్‌ ఖాన్‌, షామిల్‌ హుసేన్‌, సూఫియాన్‌ ముకీం.

ఇదీ చదవండి: Asia Cup: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ! వైభ‌వ్‌కు చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement