విధ్వంసకర శతకం.. ఆపై అజేయ డబుల్‌ సెంచరీ | Ranji Trophy: Urvil Patel 91 Ball Century Smashes Maiden Double Century | Sakshi
Sakshi News home page

విధ్వంసకర శతకం.. ఆపై అజేయ డబుల్‌ సెంచరీ

Nov 3 2026 5:05 PM | Updated on Nov 3 2026 5:48 PM

Ranji Trophy: Urvil Patel 91 Ball Century Smashes Maiden Double Century

PC: BCCI Domestic X

గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఉర్విల్‌ పటేల్‌ అదరగొట్టాడు. కేరళతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఈ బరోడా ఆటగాడు.. అదే జోరు కొనసాగిస్తూ అజేయ ద్విశతకంతో అలరించాడు.

కాగా రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌- కేరళ జట్ల మధ్య సోమవారం మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. తొమ్మిది వికెట్ల నష్టానికి 534 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

91 బంతుల్లోనే శతకం
ఓపెనర్లలో అభిషేక్‌ దేశాయ్‌ (42) రాణించగా.. ఆర్య దేశాయ్‌ (95) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. మిగిలిన వారు ఓ మోస్తరుగా రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన ఉర్విల్‌ పటేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 91 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌... దానిని డబుల్‌ సెంచరీగా మార్చాడు.

తొలి డబుల్‌​ సెంచరీ
మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 227 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్‌ పటేల్‌.. 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 210 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా అతడికి రంజీ క్రికెట్‌లో ఇదే తొలి డబుల్‌​ సెంచరీ ఇక విశాల్‌ జైస్వాల్‌ అర్ధ శతకం (77) బాదగా.. మనన్‌ హింగ్రాజియా 33, అమిత్‌ దేశాయ్‌ 36 పరుగులతో రాణించారు. కేరళ బౌలర్లలో నెడుమంకులి బాసిల్‌ మూడు వికెట్లు తీయగా.. ఆదిత్య సర్వాటే రెండు, ఎండీ నిధీశ్‌, జలజ్‌ సక్సేనా, వైశాఖ్‌ చంద్రన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఇవీ చదవండి: అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement